ICC పురుషుల ప్రపంచ కప్ 2023 మెగా టోన్నీ షురూ కావడంతో క్రికెట్ ఫీవర్ ఊపందుకుంది ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ టెలికాం ప్రొవైడర్ ఎయిర్‌టెల్ రంగంలోకి దిగింది. తన కస్టమర్ల కోసం రెండు అపరిమిత డేటా ప్లాన్‌లను ప్రకటించింది. 2 రోజులకు డేటా అవసరాలకోసం రూ.99, ఒక రోజు చెల్లుబాటయ్యేలా రూ.49 ల ప్యాక్‌ను లాంచ్ చేసింది. (గుడ్ న్యూస్: కార్ల కొనుగోలుపై మారుతి సుజుకి ఆఫర్లు)
ఈ మెగా ఈవెంట్‌లో తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అలాగే ఈ నెల 14న జరిగే భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈక్రమంలోనే ప్రీపెయిడ్ డేటా ప్యాక్ లను ప్రకటించింది. (గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా)
రూ.49, రూ.99 డేటా ప్యాక్స్
ICC వరల్డ్ కప్ 2023ను ఎంజాయ్ చేయాలనుకునే క్రికెట్ ఔత్సాహికుల కోసం రెండు ప్రత్యేకమైన డేటా ప్లాన్‌లను ఆవిష్కరించింది. ఈ డేటా ప్లాన్‌లు ప్రీపెయిడ్ కస్టమర్‌లకు అందుబాటులో ఉన్నాయి రూ.49తో రీచార్జ్‌పై 6జీబీ డేటా లభిస్తుంది. డేటా వ్యాలిడిటీ ఒక రోజు. అలాగే రూ.99 రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు రెండు రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు మొబైల్ డేటా ప్లాన్‌లతో పాటు, ఎయిర్‌టెల్ డీటీహెచ్ సైతం స్టార్ నెట్ వర్క్ సాయంతో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment