ప్రముఖ మొబైల్ దిగ్గజం యాపిల్‌కు కాకినాడ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. ఇంతకీ ఈ కంపెనీకి ఎందుకు జరిమానా విధించారు, ఎంత జరిమానా విధించారు? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐఫోన్ 12 మొబైల్ కొనుగోలు చేస్తే.. హెడ్‌ఫోన్స్ ఉచితం అనే ప్రకటన చూసి 2021లో చందలాడ పద్మరాజు మొబైల్ బుక్ చేసుకున్నారు. కానీ డెలివరీలో తనకు హెడ్‌ఫోన్స్ డెలివరీ కాలేదు. ఈ విషయం మీద యాపిల్ సంస్థ ప్రతినిధులను, కస్టమర్ కేర్‌లను ఆన్‌లైన్‌లో సంప్రదించారు. ఎప్పటికీ వారి నుంచి సరైన స్పందన రాలేదు.
యాపిల్ సంస్థ తన గోడును పట్టించుకోకపోవడంతో 2022లో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. తాను చూసిన ప్రకటనలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఫిర్యాదుదారుని వాదనలు..సాక్ష్యాలు పరిశీలించి యాపిల్ సంస్ధకు రూ. 1,29,900 జరిమాన విధించింది.
ఇదీ చదవండి: ఉద్యోగాల సృష్టికి ఏం చేయాలంటే?.. రఘురామ్ రాజన్
హెడ్‌ఫోన్స్‌కు రూ.14,900, బాధితుని మానసిక క్షోభకు రూ.10,000, కోర్టు ఖర్చులకు రూ.5,000 జరిమాన విధించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెల్లడించించినందుకు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిష్టర్ రిలీఫ్ ఫండ్‌కు చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment