కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కకు మించిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో 6 లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు యాపిల్ పేర్కొంది.
దేశంలో యాపిల్ తన కార్యకలాపాలను పెంచుకోవాలనుకునే నేపథ్యంలో 2025 నాటికి మొత్తం 2,00,000 మంది ఉద్యోగులను కలిగి ఉండాలని సంకల్పించింది. ఇందులో 70 శాతం మంది మహిళలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ ఫోక్స్‌కాన్, విస్ట్రాన్, పెగట్రాన్ వంటి యాపిల్ సరఫరాదారులలో 80,872 మంది ప్రత్యక్ష ఉద్యోగులు.. టాటా గ్రూప్, సాల్‌కాంప్, మదర్‌సన్, ఫాక్స్‌లింక్, సన్‌వోడా, ఏటీఎల్, జాబిల్ వంటి సరఫరాదారులు 84,000 మంది పరోక్ష ఉద్యోగులు ఉన్నట్లు సమచారం.
యాపిల్ కంపెనీ 2020లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ ప్రారంభించింది. అప్పటి నుంచి యాపిల్.. దాని భాస్వాములు ఏకంగా 165000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించారు. ఈ స్కీమ్ ప్రారంభంలో 2,00,000 ఉద్యోగాలను లక్ష్యంగా చేయుకుంది. భారతదేశంలో ఉద్యోగాలను పెంచడానికి యాపిల్ తనవంతు ప్రయత్నిస్తోంది.
ఎలక్ట్రానిక్స్ రంగంలోని ప్రతి ప్రత్యక్ష ఉద్యోగం.. మూడు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. యాపిల్ కార్యకలాపాల విస్తరణ ద్వారా లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. తమిళనాడులోని హోసూర్‌లో టాటా గ్రూప్ కొత్త సదుపాయం కాలక్రమేణా దాదాపు 50,000 మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉంది. ఈ అక్టోబర్‌లో ఐఫోన్ ఉత్పత్తిని ప్రారంభించనున్న ఈ ప్లాంట్ దశలవారీగా సామర్థ్యాన్ని పెంచుకోనుంది. యాపిల్ కార్యకలాపాలకు తమిళనాడు కీలక కేంద్రంగా మారింది.
ఇదీ చదవండి: 29న రిలయన్స్ ఏజీఎం.. అంచనాలన్నీ వీటిపైనే!
యాపిల్ కంపెనీ భారతదేశంలో 2021లో ఐఫోన్‌ల తయారీని ప్రారంభించింది. క్రమంగా దేశంలో ఉత్పత్తి పెరుగుతూ ఉంది. ఐఫోన్ తయారీ FY24లో రూ.1.20 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో రూ.85000 కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీంతో యాపిల్ గ్లోబల్ సప్లై చెయిన్‌లో భారతదేశం కీలకమైనదిగా మారింది. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో 14 శాతం ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment