ఫొటోలో కనిపిస్తున్న చిన్న సాధనం ఇంట్లో ఉంటే చాలు, ఎలాంటి కీటకాలైనా పరారు కావాల్సిందే! దీనిని వాడుకోవడం చాలా తేలిక. దోమలను పారదోలేందుకు వాడే మస్కిటో రిపెల్లెంట్స్ మాదిరిగానే, ప్లగ్‌లో పెట్టుకుని, స్విచాన్ చేస్తే చాలు.
మస్కిటో రిపెల్లెంట్స్ నుంచి వెలువడే రసాయనాల వాసనలు కొందరికి సరిపడవు. దీంతో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇది హైపర్‌సోనిక్ పెస్ట్ రిపెల్లెంట్ సిస్టమ్ ‘రాడార్‌కాన్ ఆర్–200’. ఇది ఆన్ చేసి ఉంచితే, చుట్టుపక్కల ఈగలు, దోమలు, చీమలు సహా ఎలాంటి కీటకాలైనా పరిసరాల్లో నుంచి మటుమాయం కావాల్సిందే!
దీని ప్రభావం సుమారు 2,700 చదరపు అడుగుల విస్తీర్ణం పరిధిలో సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీని ఖరీదు 59.99 డాలర్లు (రూ.4,773) మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment