ముంబైలో డబ్బావాలాలు చాలా ఫేమస్. ఆఫీసుల్లో పనులు చేసుకునే ఉద్యోగులకు వారి వారి ఇళ్ల నుంచి లంచ్‌బాక్సులు సేకరించి, వేళకు ఇంటి భోజనాన్ని అందించే డబ్బావాలాల వ్యవస్థ ఇప్పటివరకు మరే నగరంలోనూ లేదు. అయితే, త్వరలోనే హైటెక్ డబ్బావాలాల వ్యవస్థ ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఫొటోలో కనిపిస్తున్న బుల్లి వాహనాలే హైటెక్ డబ్బావాలాలు. డ్రైవర్ అవసరం లేని రోబో వాహనాలు ఇవి. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ హైటెక్ డబ్బావాలాలు ఇళ్ల నుంచి లంచ్‌బాక్సులు సేకరించి, ఆఫీసుల్లో పనిచేసుకునే ఉద్యోగులకు సురక్షితంగా అందించగలవని వీటి తయారీదారులు చెబుతున్నారు.
అమెరికాలోని లీపెక్స్ డిజైన్ సంస్థలో పనిచేసే చైనీస్ డిజైనర్లు సియూన్ కిమ్, యుఫెంగ్ షాంగ్ ఈ హైటెక్ డబ్బావాలాలను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment