ఇప్పటి వరకు చాలా రకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. ‘కరోనా’ దెబ్బకు ప్రపంచం అంతటా ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే, ఇవి టేబుల్ ఫ్యాన్ల మాదిరిగానే ఉంచిన చోట నుంచే తమ సామర్థ్యం మేరకు నిర్ణీత విస్తీర్ణంలో గాలిని శుభ్రం చేస్తాయి. దుమ్ము ధూళి కణాలతో పాటు సూక్ష్మజీవులను తొలగిస్తాయి.
ఫొటోలో కనిపిస్తున్న రోబో ఎయిర్ ప్యూరిఫైయర్ మామూలు ఎయిర్ ప్యూరిఫైయర్లకు పూర్తిగా భిన్నమైనది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ రోబో ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఇల్లంతా కలియదిరుగుతూ గాలిలో ఎక్కడ తేడా ఉంటే అక్కడ నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతుంది. ఇది క్షణాల్లోనే గాలిలోని దుమ్ము ధూళి కణాలను, వ్యాధికారక సూక్ష్మజీవులను తొలగిస్తుంది. ‘పయాగర్’ పేరుతో కొరియన్ డిజైనర్ గ్వాంగ్ డియోక్ సియో దీనిని రూపొందించాడు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.
అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్..
ప్రతి ఇంటిలోనూ చీమలు, దోమలు, ఈగలు, సాలెపురుగులు, బొద్దింకలు, చెదపురుగులు వంటి కీటకాలతో ఇబ్బందులు తప్పవు. వీటికి తోడు బల్లులు, ఎలుకలు వంటివి ఇంటి వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. చీమలు, దోమలు, బొద్దింకలు, చెదపురుగులను నిర్మూలించడానికి రసాయనాలతో కూడిన రకరకాల మందులు వాడుతుంటాం.
ఈ మందులు మనుషులకూ హాని చేస్తాయి. ఇక ఎలుకలను పట్టడానికి బోనులు, ట్రాప్‌లు వాడుతుంటాం. ఇన్ని ఇబ్బందులు లేకుండా వీటన్నింటినీ తరిమికొట్టే సాధనాన్ని అమెరికన్ కంపెనీ ‘టెకోఆర్ట్’ అందుబాటులోకి తెచ్చింది. ఇది అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్. దీనిని వాడటం చాలా సులువు. ప్లగ్ సాకెట్‌లో పెట్టి, స్విచాన్ చేసుకుంటే చాలు, ఇది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.
దీని ప్రభావంతో చీమలు, దోమలు, బొద్దింకలు మొదలుకొని బల్లులు, ఎలుకలు కూడా ఇంటి పరిసరాల నుంచి పరారైపోతాయి. ఈ పెస్ట్ రిపెల్లర్ 1200 చదరపు అడుగుల పరిధిలో ప్రభావం చూపుతుంది. దీని ధర 28.99 డాలర్లు (రూ.2,420) మాత్రమే!
ఇవి చదవండి: బట్టతలను దూరం చేసే.. టోపీ గురించి విన్నారా!
Comments
Please login to add a commentAdd a comment