ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లకు పూర్తిగా భిన్నమైన ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. పచ్చదనానికి లోటు రాకుండా, గాలిని ఇట్టే పరిశుభ్రం చేసేస్తుంది. చాలా ఎయిర్ ప్యూరిఫయర్ల తయారీలో ప్లాస్టిక్, లోహాలను విరివిగా వాడతారు. అమెరికన్ కంపెనీ ‘ఫ్లోరా’ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మాత్రం సహజసిద్ధమైన పదార్థాలతోనే తయారు కావడం విశేషం.
దీని తయారీలో అత్యధిక భాగం కలప, గాజు, సిరామిక్ వంటి ప్రకృతికి హాని కలిగించని పదార్థాలనే వాడారు. దీని లోపలిభాగంలో నిత్యం పచ్చగా ఉండే సజీవమైన సముద్రపు నాచును ఉపయోగించారు. ఇది రెండంచెల్లో గాలిని శుభ్రం చేస్తుంది.
ఒక అంచెలో నాచు, మరో అంచెలో ఇందులో కొబ్బరిపీచుతో ఏర్పాటు చేసిన కార్బన్ ఫిల్టర్ గాలిలోని సూక్ష్మకణాలను పూర్తిగా తొలగిస్తాయి. ఇందులో బెడ్‌లైట్‌కు సరిపోయే బల్బును కూడా అమర్చడంతో గదిలో ఒక మూల పెట్టుకుంటే, ఇంటి అలంకరణకే వన్నె తెచ్చేలా కనిపిస్తుంది. దీని ధర 141.85 డాలర్లు (రూ.11,806) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment