అపార్టమెంట్లలో పచ్చని ప్రకృతి శోభ ఉండేలా, శుభ్రమైన గాలికోసం ఇంట్లోమొక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్. వీటినే ఇండోర్ ప్లాంట్లు అని అంటారు. ఇలాంటి మొక్కలు ఇంటి అందాన్ని ఇనుమడింపజేయడం మాత్రమే కాదు స్వచ్ఛమైన గాలితో కంటికి ఆహ్లాదంగా ఉంటూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇండోర్ ప్లాంట్లు కలిగి ఉంటాయి. మరి అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందామా!
పర్యావరణహితమైన ఆరోగ్యకరమైన ఇండోర్ ప్లాంట్లతో ఇంట్లోని గాలి నాణ్యత మెరుగు పడుతుంది. కాలుష్యానికి చెక్ చెప్పవచ్చు. ఒత్తిడి లేకుండా మనసుకు హాయిగా ఉంటుంది. పచ్చని ఇండోర్ వల్ల ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి
స్నేక్ ప్లాంట్
అత్తగారి నాలుక అని కూడా పిలుస్తారు. ఇది రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను పెట్టుకోవచ్చు. గాలిలోని ఫార్మాల్డిహైడ్, జిలీన్, బెంజీన్, టోలున్, ట్రైక్లోరోఎథిలిన్ లాంటి వాటిని ఫిల్టర్ చేస్తుంది
అలోవెరా
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న అలోవెరా ఇండోర్ ప్లాంట్‌గా బెంజీన్, ఫార్మాల్డిహైడ్‌ను ఫిల్టర్ చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చుకుంటుంది. తొమ్మిది ఎయిర్ ప్యూరిఫయర్లు చేసిన పనితో దీని సామర్థ్యం సమానమని చెబుతారు. కొద్దిగా ఎండ, కొద్దిపాటి నీళ్లతో దీన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. కలబంద జెల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి.
పీస్ లిల్లీ
తెల్లటి పువ్వులతో అందంగా కనిపించే ఈ మొక్క కూడా గాలిలో ఉండే కొన్ని విష రసాయనాలను శుద్ధి చేస్తుంది. ఈ సూపర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఇండోర్ ప్లాంట్‌ను ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ , ఇతర గృహోపకరణాల ద్వారా విడుదలయ్యే ఇండోర్ కాలుష్యాలను సమర్థవంతంగా తొలగించగల క్లెన్సర్‌లలో ఒకటి.కాలుష్య కారకాలను తొలగించే విషయంలో ఇది పవర్‌హౌస్.
స్పైడర్ ప్లాంట్
స్పైడర్ ప్లాంట్‌ను కూడా ఇంట్లో చక్కగా చేర్చుకోవచ్చు, ప్రత్యేకించి పెంపుడు జంతువులకు విషపూరితం కాని కొన్ని మొక్కలలో ఇది ఒకటి. కార్బన్ మోనాక్సైడ్,జిలీన్‌తో సహా టాక్సిన్స్‌తో నివారిస్తుంది.
వెదురు మొక్క
బటర్‌ఫ్లై పామ్ లేదా అరేకా పామ్ అని పిలిచే ఈ వెదురు మొక్క భారతదేశంలోని అత్యుత్తమ గాలిని శుద్ధి చేసే మొక్కలలో ఒకటి. ఇది గాలి శుద్దీకరణకు మించిన అదనపు ప్రయోజనంగా, ఇది సహజ హ్యూమిడిఫైయర్ కూడా. ఇది పొడి శీతాకాలంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
పోథోస్ లేదా మనీ ప్లాంట్: డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. ఇంట్లోని టాక్సిన్స్ తొలగించడంలో ప్రసిద్ధి చెందింది, ప్రతి 1-2 వారాలకు ఒకసారి నీళ్లు పోస్తే చాలు. ఇందులో చాలా రకాలున్నాయి.
జెడ్ జెడ్ ప్లాంట్ తక్కువ-కాంతిలో కూడా చక్కగా పెరుగుతుంది. జిలీన్, టోలున్ , బెంజీన్ వంటి టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దీన్ని ఆఫీసుల్లో కూడా పెట్టుకోవచ్చు. వీటితోపాటు స్పైడర్ ప్లాంట్ (క్లోరోఫైటమ్ కోమోసమ్), ఫెర్న్ మొక్కలు కూడా ఈ కోవలోకే వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment