చెట్టు చుట్టూనే తెలంగాణ జీవనం
కాలుష్యం లేని వాతావరణమే భావి తరాలకు సంపద: హరీశ్
సాక్షి, సిద్దిపేట: ‘తెలంగాణ జీవన విధానం, బతుకు చిత్రం అంతా చెట్టు, పుట్టలతోనే ముడిపడి ఉంది. పండు గలు, సంస్కృతిలో చెట్ల పాత్ర కీలకమై నది’అని భారీ నీటిపారుదుల శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట లోని ఇంజనీ రింగ్ కళాశాలతోపాటు, పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాల యాల్లో ఆయన మొక్కలు నాటారు. అనం తరం ఆయన మాట్లాడుతూ మనిషి పుట్టగానే వేసే ఊయల నుంచి చనిపోగానే కాల్చే కట్టే వరకు చెట్లతోనే అంతా ముడిపడి ఉంద న్నారు. దసరా పండుగకు జమ్మిచెట్టు, బతుక మ్మ పండుగకు తంగేడు చెట్టు, బోనాల పండుగకు వేపచెట్టు.. ఇలా అన్ని పండుగలు చెట్లతోనే ముడిపడి ఉన్నాయని చెప్పారు.
కాబట్టి ప్రతీ పుట్టిన రోజున కేకులు కట్ చేయడం ఎంత ముఖ్యమో.. మొక్కలు నాటడమూ అంతే ప్రాధాన్యతగా గుర్తించాలన్నారు. చనిపో యిన వారి పేరిట కూడా మొక్కలు నాటాలని హరీశ్ పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణ లో విస్తారమైన అడవులు ఉండేవని, రానురాను అవి అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జీవిన విధానంతో అనుబంధం ఉన్న చెట్లను నాటి హరిత వనాలు ఏర్పాటు చేయడం అవసరమన్నారు. రాబోయే తరాలకు ఎంత సంపద అంద చేస్తామనేది ముఖ్యం కాదని.. కాలు ష్యంలేని వాతావరణం అందజేయడం కీలకమన్నారు. చెట్లు అంతరించి పోవడం మూలంగానే అడవుల్లో ఉన్న కోతులు ఊళ్లలోకి వస్తున్నాయని చెప్పారు.