భూమిపై స్వచ్ఛమైన గాలి కోసం పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా తెగ అన్వేషిస్తున్నారు. మానవుల మెరుగైన ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన గాలి లభించే ప్రాంతాల గురించి జరిగిన అన్వేషణలో ఓ ప్రాంతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ ప్రదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి లభిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచం చిట్టచివరి ప్రదేశంగా పిలిచే ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో వాయువ్య కొన వద్దే ఈ స్వచ్ఛమైన గాలి లభిస్తుందట. కేప్‌గ్రిమ్ అనే ద్వీపకల్పం వద్ద ఈ ప్రదేశం ఉంది. పర్యాటకులు సైతం ఆ గాలిని పీల్చేందుకు తండోపతండాలుగా వస్తుంటారు.
ఇక్కడ గాలి చాలా నాణ్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ కేప్‌గ్రిమ్‌ని దక్షిణ మహాసముద్రం మీద నుంచి పశ్చిమ గాలులు చాలా బలంగా తాకుతాయని చెబుతున్నారు. అందువల్లే ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం "ఎడ్జ్ ఆప్ ది వరల్డ్"గా ప్రసిద్ధి. భయంకరమైన గాలులకు పేరుగాంచిన ప్రాంతం కూడా. ఇక్కడ గంటకు 180 కిలోమీటర్ పర్ అవర్‌తో గాలులు వీస్తాయి. అందువల్లే కలుషితం కానీ గాలి ఇక్కడ వీస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. గాలి వేగం, గాలి దిశ డేటా ఆధారంగా కేప్‌గ్రిమ్‌కు చేరే గాలిలో దాదాపు 30 శాతం బాగుంటే చాలని దీన్ని బేస్‌లైన్‌గా తీసుకుంటామని అన్నారు.
కానీ ఇక్కడ గాలి అంతకు మించి స్వచ్ఛంగా ఉండటమే కాకుండా స్థానిక వాతావరణ వనరులతో ప్రభావితం కాకుండా చాలా పరిశుభ్రమైన గాలి ఉంటుందని శాస్త్రవేత్త స్టావర్ట్ చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఓ మోస్తారుగా స్వచ్ఛమైన గాలి లభించే ప్రాంతాలు హవాయిలోని మౌనాలోవా స్టేషన్, మాక్వేరీ ద్వీపం, అంటార్కిటికాలోని కేసీ స్టేషన్, నై అలెసుండ్, స్వాల్‌బార్డ్ పట్టణం తదితరాలు ఉన్నాయి.
కానీ ఈ టాస్మానియాలో వీచే గాలి మాత్రమే ఈ భూమిపై లభించే గాలుల్లోకెల్ల స్వచ్ఛమైన గాలి అని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ప్రస్తుతం ఈ టాస్మానియాలోని స్వచ్ఛమైన గాలిని డబ్బాలో పట్టి విక్రయిస్తున్నారట. ఒక రకంగా పరిశుభమైన గాలికి సంబంధించిన వ్యాపారం ఊపందుకుంది. ప్రతి డబ్బాలో దాదాపు ఓ వ్యక్తి 130 సార్లు టాస్మానియా గాలిని పీల్చుకునేంత స్టోరై ఉంటుందట.
Comments
Please login to add a commentAdd a comment