భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ‘గగన్‌యాన్’ ద్వారా త్వరలో మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-1 విజయవంతమైన తర్వాత ముగ్గురు భారతీయ వ్యోమగాములు గగన్‌యాన్ సాయంతో భూమికున్న దిగువ కక్ష్యలోకి వెళ్లనున్నారు. ఈ వ్యోమగాములు మూడు రోజుల పాటు నిర్ణీత కక్ష్యలో ఉంటారు. ఆ తర్వాత క్షేమంగా భూమికి తిరిగి రానున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా హ్యూమన్ స్పేస్ మిషన్ కోసం సన్నద్ధమవుతోంది.
మృతదేహాలు ఏమవుతాయి?
అనేక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటక దిశగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి 600 మందికి పైగా ప్రజలను అంతరిక్షంలోకి పంపారు. 1961లో తొలిసారిగా సోవియట్ యూనియన్‌కు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది వ్యోమగాములే ఉన్నారు. అయితే ఇటీవల కొంత మంది సామాన్యులు కూడా స్పేస్ టూరిజం కింద అంతరిక్షయానం చేశారు. అయితే అంతరిక్ష యాత్రకు వెళ్లినవారిలో ఎవరైనా అంతరిక్షంలోనే మరణించారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అదే జరిగితే వారి మృతదేహాలను భూమికి ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్నకూడా మదిలో మెదులుతుంది.
అత్యధిక ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి?
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 188 మంది అంతరిక్ష విమానాల్లో మరణించారు. 1980ల నుంచి ఇలాంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. స్పేస్ ఫ్లైట్‌తో కూడిన చాలా ప్రమాదాలు భూమిపైన లేదా అంతరిక్షంగా పరిగణించే పాయింట్‌ను చేరుకోవడానికి ముందుగానే సంభవించాయి. ఈ పరిమితిని కర్మన్ లైన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ల ఎత్తులో ఉంది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ తప్పిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతరిక్షంలో ప్రమాదానికి గురైన వ్యోమనౌకలోని బాధితులు సాధారణంగా భూమిపైన పడిపోతారు.
ముగ్గురు వ్యోమగాములు మృతి చెందినప్పుడు..
అంతరిక్షంలో ఒకే ఒక్క ప్రమాదం 1971లో జరిగింది. సాల్యూట్-1 అంతరిక్ష కేంద్రం నుండి తిరిగి వస్తున్నప్పుడు సోయుజ్-11 క్యాప్సూల్ ఒత్తిడి తగ్గింది. ఫలితంగా వ్యోమగాములు జార్జి డోబ్రోవోల్స్కీ, వ్లాడిస్లావ్ వోల్కోవ్, విక్టర్ పట్సాయేవ్ మరణించారు. క్యాప్సూల్ భూమిపైకి దిగుతూనే సముద్రంలో పడిపోయింది. అనంతరం క్యాప్సూల్ నుంచి ముగ్గురు వ్యోమగాముల మృతదేహాలను వెలికి తీశారు. అంతరిక్షంలో వ్యోమగాములు మరణించిన ఒకేఒక్క ఉదంతం ఇది.
బహిరంగపరచగానికి సోవియట్ యూనియన్ నిరాకరణ
1960 సంవత్సరపు ‘ది లాస్ట్ కాస్మోనాట్స్’ సిద్ధాంతం ప్రకారం యూరి గగారిన్ అంతరిక్ష ప్రయాణంలో విజయవంతమైన ప్రయత్నానికి ముందు, సోవియట్ యూనియన్ రహస్యంగా ఇటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో అంతరిక్షంలో ఒక ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది వ్యోమగాములు మరణించారు. అయితే సోవియట్ యూనియన్ విషయాన్ని బహిరంగపరచడానికి నిరాకరించింది. ది లాస్ట్ కాస్మోనాట్స్ థియరీ నిజమా అబద్ధమా అనేది ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఈ సిద్ధాంతం సరైనదని రుజువు చేయగల అటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తెరపైకి రాలేదు.
జంతువులను పంపినప్పుడు ఏమి జరిగింది?
మానవులను అంతరిక్షంలోకి పంపే ముందు సోవియట్, అమెరికన్ ఏజెన్సీలు 1950లలో అంతరిక్ష నౌకలో జంతువులను సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా వి-2 బ్లోసమ్ రాకెట్‌లో ఆల్బర్ట్ ఫస్ట్ అనే కోతిని పంపింది. సోవియట్ యూనియన్ స్పుత్నిక్-2 ఉపగ్రహంతో లైకా అనే కుక్కను పంపింది. ఈ రెండు జంతువులు కూడా అంతరిక్షంలో మరణించాయి. తదుపరి ప్రయత్నాలలో కూడా కొన్ని జంతువులు అంతరిక్షంలో చనిపోయాయి. ఈ జంతువులన్నీ క్యాప్సూల్‌లోనే చనిపోయాయి. ఆ క్యాప్సూల్స్ భూమికి తిరిగి వచ్చాయి. వాటి మృతదేహాలు తిరిగి లభ్యమయ్యాయి. ఇప్పటివరకు అంతరిక్షంలో ఏ జంతువు కూడా గల్లంతైన సంఘటన ఎదురుకాలేదు.
ఇది కూడా చదవండి: తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్‌కున్న సంబంధం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment