అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్‌ | Compact And Portable Air Pump Designed For Bike Car Tires | Sakshi
Sakshi News home page

అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్‌

Published Sat, Mar 23 2024 10:51 AM | Last Updated on Sat, Mar 23 2024 10:53 AM

Compact And Portable Air Pump Designed For Bike Car Tires - Sakshi

ప్రయాణాలు చేస్తున్నపుడు వాహనాల్లోని టైర్లలో కొన్ని కారణాల వల్ల గాలి దిగిపోవడం సాధారణం. అయితే పట్టణ ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి ఎదురైతే సమీపంలో గాలి పంపులు ఉండే అవకాశం ఉంది. కానీ దూరప్రాంతాలకు వెళ్లేపుడు సడెన్‌గా వాహనాల టైర్లలో గాలిదిగిపోతే ఎలా..? మళ్లీ సమీపంలోని టౌన్‌కి వచ్చి ఏదైనా ఏర్పాట్లు చేసుకుని, తిరిగి వాహనం వద్దకు చేరుకుని గాలి ఎక్కించాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసర పనిమీద బయటకు వెళ్లేపుడు ఇలాగాలి దిగిపోతే చాలా అసహానానికి గురవుతూంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని   ప్రయాణికులకు ‘రాక్‌బ్రోస్‌’ అనే కంపెనీ ఇటీవల కొత్త ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది.

ఈ కంపెనీ మినీ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ పంపును తయారుచేసింది. దాన్ని అరచేతిలో ఇమిడిపోయేలా రూపొందించారు. ఆ ఎయిర్‌పంప్‌లో రెండుమోడ్‌లు ఉంటాయి. మొదటిమోడ్‌ కోసం పంపుపై ఉన్న బటన్‌ను ఒకసారి ప్రెస్‌ చేయాలి. దాంతో అది వాల్వ్‌లోకి వెళ్తుంది. రెండోమోడ్‌ కోసం మరోసారి ప్రెస్‌ చేయాల్సి ఉంటుంది. దానివల్ల పూర్తిగా వాల్వ్‌లో ఫిక్స్‌ అయి పంపులోని గాలి టైర్‌లోకి వెళ్తుంది.

ఇందులో 100పీఎస్‌ఐ వరకు గాలి నిండేలా ఏర్పాటుచేశారు. అందులో గాలి అయిపోతే ఛార్జింగ్‌ పెట్టాలి. 25 నిమిషాల్లో అది ఫుల్‌ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. దీన్ని సైకిల్‌, బైక్‌, కార్లలో వాడుకోవచ్చని, త్వరలో భారీ వాహనాలకు వీలుగా రూపొందిస్తామని కంపెనీ చెప్పింది. ఈ పంపు ఎలా పనిచేస్తుందో తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్ట్‌చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి: ఇంజిన్‌లో సమస్య.. 16వేల కార్లను రీకాల్‌ చేసిన ప్రముఖ కంపెనీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement