లావు కావాలని..మలద్వారం గుండా గాలి పంపింగ్
ఆకతాయి చేష్టలతో యువకుడు ఆస్పత్రిపాలు
మద్యం మత్తులో బావబామ్మర్దుల పరాచకం
ఐనవోలు: బావబామ్మర్ధి పరాచకాలు.. ఆటపట్టించుకోవడాలు సాధారణంగా చూస్తుంటాం.. కానీ, ఏకంగా ఓ బావబామ్మర్ధుల జంట సరసం పరా కాష్టకు చేరింది. దీంతో ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నా యి.. మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్, ఒంటిమామిడిపల్లికి చెందిన ఓ మెకానిక్, గూడ్స్ ట్రాలీ డ్రైవర్లు మంచి స్నేహితులు. ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ (27) ఈ నెల 20వ తేదీన రాత్రి మెకానిక్ షెడ్డులో ట్రాక్టర్ రిపేర్ చేయించుకుంటున్నాడు.
అదే సమయంలో మిగతా ఇద్దరు అక్కడకు వచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరు ఆకతాయి తనంతో ఏం చేస్తున్నామో తె లియని స్ధితిలో ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ను నువ్వు బక్కగా ఉన్నావు.. లావు కావాలి.. అంటూ గేలి చేస్తూ ఆట పట్టించారు. నీకు గాలి పె ట్టి దొడ్డయ్యేలాగా(లావు) చేస్తాం.. అంటూ పరా చకాలు అడుతూ చివరకు బలవంతంగా మెకానిక్ షాపులో ఉన్న హైడ్రాలిక్ ఎయిర్ ప్రెషర్ పైపు మలద్వారం వద్ద ఉంచి ఒక్కసారిగా గాలి వది లారు. సదరు ట్రాక్టర్ డ్రైవర్ పొట్టలోకి గాలి చేరడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు.
వెంటనే కుటుంబ సభ్యులు టాక్టర్ డ్రైవర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పెద్ద పేగులోకి గాలి చేరి ఉబ్బిందని ఆపరేషన్ చేయడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే సదరు వ్యక్తి ఆహారం తీసుకుని.. మలవిసర్జన చేసే వరకు ఆస్పత్రిలోనే ఉండాలని, ఏదైనా సమస్య వస్తే మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో అయ్యే ఖ ర్చంతా ఒంటిమామిడిపల్లికి చెందిన ఇద్దరు భరి స్తున్నారు. అయితే ఆరు రోజులైనా డిశ్చార్జ్ కాకపోవడంతో విషయం స్థానికంగా అందరికీ తెలిసిపోయి.. చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment