ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా ఉండాలి. ఖర్చు ఎక్కువ కాకుండానే వీచే గాలి హాయి గొలపాలి. వేసవి ఎండల్లో ఇంట్లోని ఉక్కపోతకు, వడ గాడ్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవండి.
♦ ఎండ వేళలో కిటికీలకు మందంగా ఉండే కర్టెన్లను వాడాలి. దీని వల్ల 30 శాతం వేడి గాలిని నిరోధించవచ్చు.
♦ వాడకంలో లేని గదులను, వాటి తలుపులను మూసి ఉంచాలి. దీని వల్ల చల్లదనం త్వరగా తగ్గిపోదు.
♦ టేబుల్ ఫ్యాన్ ముందు (గాలికి ఎదురుగా) ఐస్ ముక్కలు వేసి ఉన్న పాత్ర ఒకటి ఉంచితే దాని మీదుగా వీచే గాలి చల్లగా ఉంటుంది. గది కూడా చల్లబడుతుంది.
♦ రెడీమేడ్ పరుపులు, దిండ్లు వాటి మీద వాడే సింథటిక్ దుప్పట్లు కూడా వేడిని పెంచుతాయి. వీటి స్థానంలో కాటన్ పరుపులు, దుప్పట్లను చేర్చాలి.
♦ కూలర్ గాలి నేరుగా ఒంటికి కాకుండా నేలకు తగిలేలా సెట్ చేసుకోవడం వల్ల గది త్వరగా చల్లబడుతుంది. అలాగే నేల మీద పడక వేడిని తగ్గిస్తుంది.
♦ క్యాండిల్స్, ఫ్లోరోసెంట్ బల్బులను ఈ కాలం వాడకపోవడం ఉత్తమం.
♦ చివరిగా.. మీ ఇంట్లో మొక్కలున్నాయా? పెరట్లోవి సరే. ఇంట్లో కిటికీల దగ్గర, కర్టెన్‌ల దగ్గర! వాటి వల్ల కూడా మీ ఇల్లు కూల్‌గా ఉంటుంది.
మీ ఇల్లు చల్లగుండ
Published Mon, May 7 2018 12:56 AM | Last Updated on Mon, May 7 2018 12:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment