Air To Water Generator Machine: California Skysource Create Advanced Air To Water Technology - Sakshi
Sakshi News home page

ఇచట గాలి నుంచి నీరు తయారు చేయబడును

Published Sat, Jan 16 2021 2:54 PM | Last Updated on Sat, Jan 16 2021 4:09 PM

California Skysource Create Advanced Air To Water Technology - Sakshi

వాషింగ్టన్‌ : వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు అంటారు. రెండోదాని సంగతి ఏమిటోగానీ వాన రాకడను మనమే డిసైడ్‌ చేసే రోజులు రానున్నాయనేదానికి ఈ వాటర్‌ జనరేటర్‌ చిన్న ఉదాహరణ. అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌–టు–వాటర్‌ టెక్నాలజీతో గాలి నుంచి నీరు తయారు చేసే యంత్రానికి  రూపకల్పన చేసింది కాలిఫోర్నియాకు చెందిన స్కైసోర్స్, స్కై వాటర్‌ అలయెన్స్‌. వెడ్యు (వుడ్‌–టు–ఎనర్జీ డిప్లాయబుల్‌ ఎమర్జెన్సీ వాటర్‌)అనే ఈ యంత్రం నుంచి మంచినీరు తయారు చేయడానికి పెద్ద ఖర్చు అక్కర్లేదు. సింపుల్‌గా మనకు అందుబాటులో ఉన్న ఎండుపుల్లలు, ఎండిన పండ్లతొక్కలు, ఎండిన కొబ్బరి పెంకులు, పొట్టు....మొదలైనవి యంత్రంలో వేసి వేడెక్కిస్తే  నీటి ఆవిరి ద్వారా జనరేటర్‌ స్వచ్ఛమైన మంచినీటిని తయారు చేస్తుంది. ఈ మొబైల్‌ వాటర్‌ జనరేటర్‌ను ఎలాంటి వాతావరణంలోనైనా ఉపయోగించవచ్చు. సోలార్, బ్యాటరీ సిస్టంతో కూడా ఈ యంత్రం పని చేస్తుంది. రోజుకు రెండు వేల లీటర్ల స్వచ్ఛమైన నీటిని తయారు చేసే ఈ వాటర్‌ జనరేటర్‌ను ప్రస్తుతం శరాణార్థి శిబిరాలు, కరువు ప్రభావిత ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారు. (చదవండి: సముద్రపు నీరు మంచి నీరుగా..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement