
తడి కదలికలు
గాలి ఉయ్యాలలో ఊరేగుతూ పండుటాకై రాలిపోతూ మళ్లీ చిగురిస్తూ చెట్టు మోస్తున్న సహనానికి హద్దే లేదు పగలు...
గాలి ఉయ్యాలలో ఊరేగుతూ పండుటాకై రాలిపోతూ మళ్లీ చిగురిస్తూ చెట్టు మోస్తున్న సహనానికి హద్దే లేదు పగలు ప్రవహించే ఎండ...
నీడై సేదతీర్చే చల్లదనాల వెన్నెల...
దీర్ఘ చతురస్రపు ప్రేమమయ ఆకారం పుటలు చెప్పే గాథలూ విస్తరింపజేసే వెలుగులూ పుస్తకాల జ్ఞానపరిమళాలకు అంతే లేదు వికసించే అక్షర అనుభూతుల సందర్భం... తోడై వెంట నడిచే వివశత్వాల జడి...
వడివడిగా అంగలేసుకుంటూ ప్రవాహం పాటూ పోటుల సంద్రంతో దోబూచులాడుతూ నది ఊసుల చరిత్రకు కాలనియమం లేదు తడిరాగాలు ఆలపించే బంగరు పోగులు... పులకిత నేలతల్లి అనంత సేద్యాల పల్లవి...
హాయిగా ఉంది... చెంత- చెట్టు ఉంది. ఉత్సాహంగా ఉంది... చేత- పుస్తకం ఉంది. మనసు తడిగా ఉంది... చేరువ- నది ఉంది.
- దాట్ల దేవదానం రాజు
94401 05987