అక్కడ గంటకు 10 రూపాయలు.. ఎందుకో? | A restaurant in China actually charges its customers for fresh air | Sakshi
Sakshi News home page

అక్కడ గంటకు 10 రూపాయలు.. ఎందుకో?

Published Wed, Dec 16 2015 12:40 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

అక్కడ గంటకు 10 రూపాయలు.. ఎందుకో?

అక్కడ గంటకు 10 రూపాయలు.. ఎందుకో?

బీజింగ్: సమయానికి తగుమాట అన్నట్టు కాలుష్య భూతాన్ని సాకుగా చూపి డబ్బులు దండుకోవాలని చూసిన ఓ రెస్టారెంట్ ఓ కుటిల ఎత్తు వేసింది. వినియోగదారుల అప్రతమత్తతో చివరికి తోకముడిచింది. చైనాలోని ఒక హోటల్ అదనంగా వడ్డిస్తున్నచార్జి చూసి చైనీయులు గుడ్లు తేలేశారు. అక్కడ భోంచేశాక, వాళ్లిచ్చిన బిల్లులో ఓ వింత చార్జి చూసి విస్తుపోయారు.

విషయం ఏమంటే.. జియాంగ్జు రాష్ట్రంలోని  ఓ హోటల్ శుద్ధమైన, స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నందుకు గంటకు ఒక యువాన్ (రూ. 10.35) వసూలు చేస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన వినియోగదారులు యాజమాన్యాన్ని నిలదీశారు. తమ హోటల్లో కూర్చున్నంతసేపు  పరిశుభ్రమైన గాలి పీల్చుకున్నందుకే ఈ వడ్డన అని చెప్పింది యాజమాన్యం. కలుషితమైన గాలిని శుభ్రం చేసేందుకు ప్రత్యేక ఎయిర్ ప్యూరిఫయర్ మెషీన్లు వాడుతున్నామని సెలవిచ్చింది. దీనికోసం చాలా ఖర్చు పెట్టామని, అందుకే ఈ చార్జి అంటూ సమర్ధించుకుంది.

వారి సమాధానంతో కడుపు మండిన ప్రజలు స్థానిక అధికారులకు ఫిర్యాదుచేశారు. వాళ్లు తక్షణమే స్పందించి ఈ అదనపు బాదుడు వెంటనే ఆపేయాలని ఆదేశించారు. దీంతో వినియోగాదారులు ఇపుడు ఈ గాలి ఫ్రీయే అంటూ ఊపిరి పీల్చుకున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement