'చీకటిని చూసి భయపడుతున్నాడట'
ముంబై: ఎందరో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముంబై మారణహోమం కేసులో కీలక నిందితుడు అబూ జుందాల్ వ్యవహరశైలి అనుమానాస్పదంగా మారింది. వందలమంది జీవితాల్లో చీకట్లు నింపిన అబూ జుందాల్... ఇప్పుడు అదే చీకటిని చూసి భయపడుతున్నాడట. తనకు గాలి, వెలుతురు కావాలని పేచి పెడుతున్నాడట.
ముంబైలోని అర్థర్ జైలులో ఖైదీగా ఉన్న అబూ జుందాల్ నిరాహార దీక్షకు దిగాడు. తనను చీకటి గది నుంచి వెలుతురు ఉన్న గదిలోకి మార్చాలంటూ దీక్ష చేపట్టాడు. చీకటి గదిలో ఉండడం వల్ల తాను మానసికంగా ఒత్తిడికి గురవుతున్నానని జుందాల్ తెలిపాడు. తన డిమాండ్లను పేర్కొంటూ బుధవారం మోకా కోర్టులో పిటిషన్ కూడా వేశాడు. సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబూ జుందాల్‌ను నిఘా వర్గాలు 2012లో సౌదీ అరేబియాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.