వంటమనిషి వల్ల.. వంద మందికి కరోనా
ముంబై : దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అధికారుల దగ్గరనుంచి సామాన్య ప్రజానికం వరకు ఎవరినీ వదలట్లేదు. తాజాగా ముంబైలోని ఆర్థర్ రోడ్డు సెంట్రల్ జైలులో 77 మంది ఖైదీలకు కోవిడ్ సోకిన ఘటన ఆందోళన కలిగిస్తుంది. అంతేకాకుండా జైలులోని 26 మంది పోలీస్ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం ప్రకటించారు.
దీంతో మొత్తంగా ఆర్థర్ జైలులో 100కి కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం వీరందరిని క్వారంటైన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మిగతా ఖైదీలకు కరోనా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏడేళ్ల కన్నా తక్కువ జైలు శిక్షపడిన సుమారు 5వేల మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. మిగతా ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని, తెలిపారు. (101 మంది అరెస్ట్.. ఒక్క ముస్లిం కూడా లేడు )
77 inmates & 26 police personnel at Mumbai's Arthur Road prison have tested positive for #COVID19. They will be sent to Saint George's hospital for treatment: Anil Deshmukh, Maharashtra Home Minister pic.twitter.com/0IAzpOd4Yz
— ANI (@ANI) May 7, 2020
జైలులో వంటమనిషికి కరోనా సోకిందని, ఇతని నుంచే మిగతా వారికి కరోనా సోకినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా 800 మంది సామర్థ్యం ఉన్నమాత్రమే ఆర్థర్ రోడ్ జైలులో ప్రస్తుతం 2,700 మంది ఖైదీలు ఉన్నట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 1362 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 52,952 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.