
సింధూరి (ఫైల్)
సాక్షి, అనంతపురం(రాప్తాడు): మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి కుమారై గడ్డం రాజ సింధూరి (18) కనిపించడం లేదు. అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న సింధూరి శనివారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులతో కలసి నిద్రపోయింది.
ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు తల్లిదండ్రులు నిద్ర లేచి చూడగా కనిపించడం లేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రాఘవరెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96817కు సమాచారం ఇవ్వాలని కోరారు.
చదవండి: (హనీట్రాప్ వెనుక ఇదీ కుట్ర!.. ఇంజనీరింగ్ విద్యార్థినితో కథ అమలు)