ప్రాణం తీసిన పాము భయం | The fear of the snake's take life | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన పాము భయం

Published Mon, Aug 29 2016 9:40 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్రాణం తీసిన పాము భయం - Sakshi

ప్రాణం తీసిన పాము భయం

  • సడన్‌ బ్రేక్‌తో ఆటో బోల్తా
  • ఒక ప్రయాణికుడు మృతి
  • మరో ఏడుగురికి గాయాలు
  • పోలీసుల అదుపులో డ్రైవర్‌
  • ముత్తువకుంట్ల నుంచి సోమవారం ప్యాసింజర్‌ ఆటో పది మంది ప్రయాణికులతో మండల కేంద్రం కనగానపల్లికి బయల్దేరింది. కోనాపురం దాటగానే రోడ్డుపై ఎదురుగా పాము కనిపించడంతో భయపడిపోయిన డ్రైవర్‌ తిరుపాలు సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న బాలేపాళ్యం గ్రామానికి చెందిన నడిపి నరిసింహులు (50), అక్కమ్మ, బొమ్మయ్య, శ్రీరాములు, రామస్వామి, పెద్దన్న, ప్రకాష్, నరిసింహులు గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని కనగానపల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వచ్చారు. తీవ్రంగా గాయపడిన నడిపి నరిసింహులు అప్పటికే మతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మిగిలిన వారికి ప్రథమ చికిత్స చేసి వారిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. మతుడి కుటుంబ సభ్యుల రోదనలతో కనగానపల్లి పీహెచ్‌సీ ఆవరణం దద్దరిల్లింది.  ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ తిరుపాలును పోలీసులు అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.



     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement