![Case Registered Against TDP Leader Paritala Sriram - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/24/Paritala-Sriram.jpg.webp?itok=EVQpT3if)
రామగిరి: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, రాప్తాడు టీడీపీ నేత పరిటాల పరిటాల శ్రీరామ్‌పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు రామగిరి ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేసిన పరిటాల శ్రీరామ్‌పై రామగిరి మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆ మేరకు శ్రీరామ్‌పై 153ఎ సెక్షన్ కింద రెచ్చగొట్టేవిధంగా వాఖ్యలు చేయడం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment