చంపుతానని బెదిరిస్తున్నాడు | - | Sakshi
Sakshi News home page

చంపుతానని బెదిరిస్తున్నాడు

Published Tue, Jan 23 2024 12:20 AM | Last Updated on Tue, Jan 23 2024 8:24 AM

వీడియోలో మాట్లాడుతున్న బండి నాగరాజు  - Sakshi

వీడియోలో మాట్లాడుతున్న బండి నాగరాజు

ఆత్మకూరు: ‘నాకు చాలా అప్పులు ఉన్నాయి. అప్పుల బాధ ఎక్కువైంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక నా భూమి అమ్మి అప్పులు చెల్లించాలనుకుంటే పరిటాల కుటుంబం అండ చూసుకుని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరుశురామ్‌ నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు’ అంటూ బి.యాలేరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత బండి నాగరాజు వాపోయాడు.

ఇందుకు సంబంధించి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. వీడియోలో బండి నాగరాజు మాట్లాడుతూ... ‘ఎస్పీ సార్‌కు నా విన్నపం. నా భూమి అమ్ముతుంటే బండి పరశురామ్‌ అడ్డుపడుతూ పలుమార్లు నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశా. ఇప్పటికే బండి పరుశురామ్‌పై చాలా కేసులున్నాయి. పరిటాల శ్రీరామ్‌, పరిటాల సునీత, బాలాజీ అండ చూసుకుని నన్ను చంపుతానంటూ బెదిరిస్తున్నాడు. మా తాతకు ఐదుగురు కుమారులు ఉండగా... మా నాన్న నాల్గోవాడు.

రెండవ వ్యక్తి ముసలన్న కుమారుడే బండి పరుశురామ్‌. నాకు పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ఆక్రమించుకునేందుకు పరుశురామ్‌ ప్రయత్నిస్తున్నాడు. కురుబ కుల పెద్దలు జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాలి. నాకున్న అప్పులు తీర్చుకునేందుకు నా భూమిని అమ్ముతున్నాను. పరుశురామ్‌ ఆగడాలను ఆపకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం. నాకు ఎలాంటి హాని జరిగినా బండి పరుశురామే కారణమవుతాడు’ అంటూ ఎస్పీ అన్బురాజన్‌, కురుబ కులస్తులకు సెల్ఫీ వీడియో ద్వారా నాగరాజు అభ్యర్థించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement