
పరిటాల శ్రీరామ్ పేరుతో డబ్బులు డిమాండ్
అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ పేరుతో ఓ న్యాయవాదిని బెదిరించారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ పేరుతో ఓ న్యాయవాదిని బెదిరించారు.
ఆగంతకులు పరిటాల శ్రీరామ్ పేరు చెప్పి ధర్మవరంకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ను బెదిరించి రెండు లక్షల పాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని హెచ్చరించారు. ఈ కేసులో పోలీసులు దాదాలూరుకు చెందిన టీడీపీ కార్యకర్త శ్రీనివాసనాయుడును అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లాలోనే శుక్రవారం టీడీపీ నాయకుడు పోతుల సురేష్ పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన సంఘటన వెలుగుచూసింది.