వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ | Paritala Sriram to contest in next elections, says paritala sunitha | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ

Published Mon, Sep 22 2014 12:50 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ - Sakshi

వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ పోటీ

అనంతపురం : వచ్చే ఎన్నికల్లో తన తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత తెలిపారు. పరిటాల కుటుంబం పేరుతో బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె సోమవారమిక్కడ హెచ్చరించారు. కాగా గత కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తాడని పరిటాల సునీత వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా సమయం అవసరమని చంద్రబాబు ఆదేశాలతో శ్రీరామ్ పోటీ నుంచి తప్పుకున్నట్లు  కథనాలు వెలువడ్డాయి.  ఎన్నికలు రావటానికి ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉన్నా ....పరిటాల సునీత తన వారసుడిని ముందుగానే ప్రకటించేయటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement