
సాక్షి, హైదరాబాద్ : రౌడీయిజంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న పరిటాల శ్రీరాం, కరణం బలరాంలకు అవమానకర పరాజయం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ట్విటర్ వేదికగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సుపుత్రుడు నారా లోకేష్‌లపై ధ్వజమెత్తారు. ‘చీరాల అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్ధి కరణం బలరాం పెద్దఎత్తున బయటి వ్యక్తులను దింపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారు. రాప్తాడులో పరిటాల శ్రీరాం రౌడీయిజం చేస్తున్నారు. బలరాం, శ్రీరాంలకు అవమానకర పరాజయం తప్పదు.’ అని ట్వీట్ చేశారు.
మీ రాఘవేంద్ర రావు పరామర్శించాడా?
జయసుధ, ఆలీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎలా చేరతారని, తిత్లీ తుఫాన్ వచ్చినపుడు వాళ్లిద్దరు ఎక్కడికెళ్లారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారంటే అయనకు నిజంగా ఏదో అయినట్లే ఉందని ఎద్దేవా చేశారు. వంద కోట్ల టీటీడీ నిధులను దోచిపెట్టిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బాధితులను పరామర్శించాడా? అని, ఇతర రాష్ట్రాల నేతలు కేజ్రీవాల్, మాయావతి,మమతలు ఓదార్చారా? అని నిలదీశారు.
పప్పునాయుడు గెలుపు కోసం..
‘మంగళగిరిలో పప్పునాయుడు గెలుపు కోసం ఓటుకు పది వేలు పంపిణీ చేస్తున్నారు. కూపన్లు ఇస్తున్నారట. వాటిని గుంటూరులోనో, విజయవాడలోనో ఫలానా వ్యక్తికి చూపిస్తే డబ్బు చెల్లిస్తారట. ఎన్ని తాయిలాలు ముట్ట చెప్పినా ఆర్కే గెలుపును ఆపడం చంద్రబాబు తరం కాదు.’ అన్నారు. మందలగిరి మాలోకానికి స్టాన్‌ఫోర్డ్‌లో సీటు కోసం అప్పట్లో ఒక స్పాన్సర్‌తో 50 కోట్లు డొనేషన్ కట్టించారని, అమరావతికి డిజైన్లిచ్చే సంస్థలతో ఇప్పుడు హైదరాబాద్‌లో రూ. 300 కోట్ల ప్యాలెస్ కట్టించుకున్నారని ఆరోపించారు. జీవితమంతా మందిపై పడి బతకడమేనా చంద్రబాబూ... అంటూ, ఇది ఎంగిలి కూడు తినడం కాదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment