
పరిటాల శ్రీరామ్ కేసు కొట్టివేత
ఎన్నికల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నమోదైన కేసుకు సరైన సాక్ష్యాలు రుజువు
ధర్మవరం టౌన్ : ఎన్నికల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నమోదైన కేసుకు సరైన సాక్ష్యాలు రుజువు కాకపోవడంతో పరిటాల శ్రీరామ్ కేసును జూనియర్ సివిల్ జడ్జి లీలావతి బుధవారం కేసును కొట్టివేశారు. 2014 ఏప్రిల్ 30న ఎలకుంట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నపాటి గొడవ జరగడంతో అక్కడే ఉన్న పోలీసులు వీడియోను తీశారు.
పోలీసుల నుంచి సెల్‌ను లాక్కొని పగలగొట్టి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అప్పట్లో పోలీసులు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన అనంతరం సాక్షులు ఎవరూ లేకపోవడంతో పాటు సరైన రుజువులు లేకపోవడంతో కేసును జూనియర్ సివిల్ జడ్జి లీలావతి కొట్టివేశారు.