
అనంతపురం: ఆత్మకూరు మండల పోలీస్ స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌పై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఎన్నికల ఓటింగ్‌లో భాగంగా తోపుదుర్తి గ్రామంలో ఓటర్లను పోలింగ్ బూత్ వద్ద భయభ్రాంతులకు గురి చేశారనే విషయంలో(రాయిటింగ్ ) కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.