కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను పోలీసులు సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను పోలీసులు సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు వస్తుండగా మార్గ మధ్యంలోనే ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా నుంచి రథయాత్రకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో నిరసన తెలిపిందేందుకు మందకృష్ణ విజయవాడకు వెళుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దారి కాచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.