ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీ వర్గీకరణకు సహకరించని చంద్రబాబును అడ్డుకుని నిరసన తెలుపుతామని ఎమ్మార్పీఎస్ నాయకుల హెచ్చరికలతో పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు మాదిగ జాతిని మోసం చేసిన చంద్రబాబును అడ్డుకుని తీరుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరిస్తున్నారు. ముందస్తు నిరసన తెలుపుకునేందుకు అనుమతి కోరితే పోలీసులు నిరాకరించటం దౌర్భాగ్యమన్నారు. తమను పోలీసులే రెచ్చగొట్టేలా చేస్తున్నారని మందకృష్ణ ఆరోపించారు. ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో మందకృష్ణ మాదిగ మకాం వేసిన హోటల్ వద్ద పోలీసులు మోహరించారు. అంతేకాకుండా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై నిఘా పెట్టారు. ఇప్పటికే పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పలుచోట్ల టీడీపీ ప్లెక్సీలను, జెండాలను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తొలగించారు.