
‘కురుక్షేత్రం’ జరిగి తీరుతుంది..
కురుక్షేత్ర మహాసభను నిర్వహించి తీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
తెలంగాణలో చంద్రబాబు పాదయాత్రకు తాము సహకరించినా.. ఆయన మరిచిపోయారని ఆరోపించారు. మాదిగల సహకారంతోనే ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వర్గీకరణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఏదేమైనా విజయవాడ–గుంటూరు మధ్యలో కురుక్షేత్ర సభ నిర్వహించేందుకు హైకోర్టు నుండి అనుమతి రాగానే తేదీ ప్రకటిస్తామని మంద కృష్ణ వెల్లడించారు.