వర్గీకరణ సాధించే వరకూ పోరాటం | fight for Classification | Sakshi
Sakshi News home page

వర్గీకరణ సాధించే వరకూ పోరాటం

Published Tue, Sep 27 2016 9:17 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

వర్గీకరణ సాధించే వరకూ పోరాటం - Sakshi

వర్గీకరణ సాధించే వరకూ పోరాటం

కోదాడ : ఎస్సీల వర్గీకరణ సాధించే వరకూ ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, నాయకులు వెనుదిరుగవద్దని టీఎమ్మార్పీస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌ కోరారు.

కోదాడ : ఎస్సీల వర్గీకరణ సాధించే వరకూ ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, నాయకులు వెనుదిరుగవద్దని టీఎమ్మార్పీస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌ కోరారు. డప్పు–చెప్పు కార్మికులకు నెలకు 2 వేల రూపాయల పించన్‌ ఇవ్వాలని ఆయన చేపట్టిన పాదయాత్రలో భాగంగా మంగళవారం కోదాడలోని రంగాథియేటర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. డప్పు, చెప్పు కార్మికులకు 2 వేల రూపాయల పింఛన్‌ ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు మీ వెంటే ఉంటానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హమీ ఇచ్చారని దానిని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. తన పాద యాత్ర ఇప్పటికే 175 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. టీఎమ్మార్పీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌ మాట్లాడుతూ తెలంగాణ సాధన పోరాటంలో మందుండి పోరాడినది మాదిగలేనన్నారు. నవంబర్‌ 16న లక్ష మంది మాదిగలతో కలిసి భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నామని, మాదిగలంతా ఆ సభకు తరలిరావాలని కోరారు. ఎస్సీలలో ఎన్నో ఉపకులాలు ఉన్నప్పటికీ ఒకటి రెండు కులాలే రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తూ వస్తున్నాయన్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే విధంగా అన్ని పార్టీలు కృషి చేయాలని, అందుకు మాదిగ నాయకులు, కార్యకర్తలు రాజీలేని పోరాటాలు నిర్వహించాలని కోరారు. రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర జరుగనుంది. అంతకు ముందు రాత్రి బసచేసిన కోదాడ రైస్‌మిల్లర్స్‌ భవనం నుంచి బయలుదేరిన పాతయాత్ర కార్యకర్తలు,నాయకులు కోలాటాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. పట్టణంలో శ్రీనివాస్‌ ఎమ్మార్పీస్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రా్రçష్ట ఉపాధ్యక్షుడు చింతాబాబు, ఆమరారపు శ్రీను, కుటుంబరావు, రాయల వీరస్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement