ఎస్సీ వర్గీకరణతోనే సామాజిక న్యాయం
కోదాడఅర్బన్ : ఎస్సీల వర్గీకరణతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో జరిగిన సంఘం కోదాడ–హుజూర్‌నగర్ నియోకవర్గాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 20న హైదరాబాద్‌లో నిర్వహించే ధర్మయుద్ధ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతలపాటి చిన్నశ్రీరాములు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు మలñ ్లపాక వెంకన్న, నాయకులు ఏపూరి పర్వతాలు, కె.అంజయ్య, బొడ్డు హుస్సేన్, శౌరి, ఎం.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పవన్‌కుమార్
ఈ సందర్భంగా సంఘం నియోజకరవర్గ ప్రధాన కార్యదర్శిగా మొలుగూరి పవన్‌కుమార్‌ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.