
సాక్షి, సూర్యపేట: కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పణ వివాదంలో హైకోర్టులో ఆయనపై కేసు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు కోరుతూ ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీంతో పాటు మూడేళ్ల పాటు హై కోర్టుకు హాజరు కాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
కాగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సందర్భంగా మల్లయ్య యాదవ్ ఆస్తుల వివరాలు సరిగా వెల్లడించలేదని ఆయన ఎన్నికను ప్రశ్నిస్తూ మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ హైకోర్టులో కేసు వేయగా దీని విచారణ హైకోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో తన వివరణ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మల్లయ్య యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment