దళితులకు తీరని అన్యాయం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ
సంగెం/స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ : తెలంగాణ రాష్ట్రం లోదళితులకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సంగెంలో పరకాల నియోజకవర్గ స్థాయి ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల విస్తృతస్థాయి చైతన్య సదస్సు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో దొరలు, రెడ్ల పాలన నడుస్తోందన్నారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టేలా సీఎం కేసీఆర్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయంగా పాతర పెట్టేవరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. అవినీతి ఆరోపణలు వచ్చిన అందరినీ రాజయ్యలా ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియూ, తెచ్చిన కేసీఆర్ జాతిపిత అరుుతే.. మరి తెలంగాణ అమరవీరులు ఏమవుతారని నిలదీశారు.
మాదిగల వెన్నుపోటుదారుడు కడియం
మాదిగల అండతో రాజకీయాల్లో ఎదిగిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. మాదిగలకే వెన్నుపోటుదారుడిగా పనిచేస్తున్నాడని మంద కృష్ణమాదిగ ధ్వజమెత్తారు. ఏడు నెలల క్రితం వరంగల్ పార్లమెంట్ టికెట్‌ను కేసీఆర్ మాదిగలకే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారని చెప్పిన కడియం.. ప్రస్తుతం ఆ స్థానంలో టీఆర్‌ఎస్ నుంచి తన కుమార్తెను బరిలోకి దింపేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మాదిగలకే వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎంఎస్‌పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్, జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లేష్, నియోజకవర్గ ఇన్‌చార్జి గంగారపు శ్రీనివాస్, ఇన్‌చార్జి పుట్ట రవి, మండల అధ్యక్షుడు మెట్టుపల్లి రమేశ్, కళాకారుల ఇన్‌చార్జి విజయ్,మామిడాల దర్శన్ తదితరులు పాల్గొన్నారు.