కర్నూలు: ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ మూవీ విజయోత్సవ వేడుకలో పాల్గొనటానికి శనివారం ఎమ్మిగనూరు వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్ ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకుని తమ నిరసన గళం వినిపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్ ముందు ఆందోళన చేపట్టాయి. దీంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.