గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆందోళన కార్యక్రమం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆందోళన కార్యక్రమం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సోమవారం ఆందోళనకు దిగారు. మంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా... రూరల్ ఎస్‌ఐ రామకృష్ణ అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి.