pattipati pulla rao
-
టీడీపీనేత పత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్
సాక్షి, విజయవాడ: టీడీపీనేత పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం పోలీసుస్టేషన్లో శరత్‌పై కేసు నమోదు అయింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో సహా మొత్తం ఏడుగురుపై పోలీలు కేసు నమోదుచేశారు. ఐపీసీ 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద శరత్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పుల్లారావు భార్య, బావమరిదితో పాటు మరో ఐదుగురుపై కేసు చేశారు. అవెక్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. శరత్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఈనెల 26న ఏపీ ఎస్డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అవెక్స్ కంపెనీలో 2019 డిసెంబరు నుంచి 2020 ఫిబ్రవరి వరకు అడిషనల్ డైరక్టరు హోదాలో శరత్ ఉన్నారు. సుమారు రూ. 16కోట్లు మేర పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట శరత్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు పత్తిపాటి పుల్లారావు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇతర నాయకులు చేరుకున్నారు. సీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. -
ఏపీ మాజీమంత్రి పత్తిపాటి సతీమణిపై ఫిర్యాదు
బంజారాహిల్స్: ఏపీ మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మపై భూకబ్జాకు సంబంధించి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి ఎ.మురళీముకుంద్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో తమ సొసైటీకి చెందిన భూమిని కబ్జా చేశారని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదివారంరాత్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్ నంబర్ 853/ఎఫ్‌లోని 1,519 గజాల స్థలంపై కొంతకాలంగా వివాదం నడుస్తోందని, అది తమదేనంటూ వెంకాయమ్మ వాదించడమే కాకుండా ఆమె అనుచరులు సొసైటీకి చెందిన బోర్డును కూడా తొలగించారని ఆరోపించారు. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకాయమ్మ, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకో వాలని ఆయన కోరారు. అక్రమంగా ఈ ప్లాట్ పొందిన సీహెచ్ శిరీష దీనిని పి.శ్రీహరికి గిఫ్ట్ డీడ్ చేశారని, మళ్లీ శ్రీహరి 2020 డిసెంబర్ 31న ఎల్లోస్టోన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్న పత్తిపాటి వెంకాయమ్మకు ఏజీపీఏ చేసినట్లు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్లాట్ వ్యవహారం అటు న్యాయ స్థానం లోనూ, ఇటు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణలో ఉండగా తాజాగా వెంకాయమ్మ రంగప్రవేశంతో మరింత ఆసక్తికరంగా మారింది. -
వామ్మో... వెంకాయమ్మ..!
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మ పేరు చెబితేనే నియోజకవర్గ ఉద్యోగులు హడలిపోతున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం, ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి కావడంతో వెంకాయమ్మ చెప్పిందే వేదంగా నడిచింది. ఇందులో భాగంగా చిలకలూరిపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో పనిచేస్తున్న సిబ్బంది తనను కలవలేదని.. ఒకేసారి 14 మందిని బదిలీ చేయించింది. తన భర్తను పట్టుపట్టి అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి కామినేనిపై ఒత్తిడి తెప్పించి ఆస్పత్రి సిబ్బందిని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయించింది. ఎవరైనా సరే నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉద్యోగులు తనను కలవాలని లేదంటే ఆస్పత్రి సిబ్బంది తరహాలోనే బదిలీ కావాల్సి ఉంటుందని, ఆమె ఉద్యోగులు, సిబ్బందిని హెచ్చరించినట్టు సమాచారం. అందుకే నియోజకవర్గంలో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వెంకాయమ్మ పేరు చెబితే చాలు భయపడిపోతున్నారు. అదేవిధంగా వెంకాయమ్మ అగ్రిగోల్డ్ భూములను కొనుగోలుచేసి తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, పుల్లారావు మంత్రి అయితే వెంకాయమ్మ దూకుడు మామూలుగా ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
దోపిడీకి అడ్డుకట్టేస్తాం
► సెలెక్ట్ ఛానల్ పేరుతో ప్రజల డబ్బు లూఠీ చేస్తున్నారు ► వినియోగదారుడు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం ► తూకం, ధరలపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ :1967 ► రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒంగోలు టౌన్: ‘కిన్లీ వాటర్ లీటర్ బాటిల్ 20 రూపాయలు అమ్ముతున్నారు. దానికి సెలెక్ట్ ఛానల్ అనే పేరు తగిలించి రూ.50కి అమ్మేస్తున్నారు. పెప్సీ కూల్ డ్రింక్ బాటిల్ రూ.30కి అమ్ముతున్నారు. దానిని కూడా సెలెక్ట్ ఛానల్ పేరుతో రూ.60కి విక్రయిస్తున్నారు. సెలెక్ట్ ఛానల్ పేరుతో వాటర్, కూల్ డ్రింక్ కంపెనీలు ప్రజల డబ్బు లూఠీ చేస్తున్నాయని‘ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఇలాంటి దోపిడీలకు అడ్డుకట్ట వేసి వినియోగదారులకు నష్టం జరగకుండా ఉండేందుకు సంబంధిత విభాగాలను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాలశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో తాను పెట్రోల్ బంకులు తనిఖీ చేసినప్పుడు ఒకదానిలో 100 లీటర్లకు 11 నుంచి 12లీటర్ల తేడా కనిపించిందన్నారు. ఒంగోలులో మద్రాసు ఫెర్టిలైజర్స్ కంపెనీని తనిఖీచేస్తే ఎరువుల బస్తాకు 4 నుంచి 5 కేజీలు తక్కువ ఉన్నట్లు తేలిందన్నారు. ఇప్పటివరకు ఆరు కంపెనీలపై కేసులు పెట్టినట్లు వెల్లడించారు. సమస్యలపై పరిష్కార వేదిక.. గతంలో ఎరువుల కంపెనీలపై రైతులకు నమ్మకం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని మంత్రి చెప్పారు. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువులో తూకం, కొలతలు, ధరల్లో వ్యత్యాసం కనిపిస్తే సంబంధిత కంపెనీలు, వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్ 1967 ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని 750మందితో పరిష్కార వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో దీనికి సంబంధించిన వ్యక్తులు ఉంటారని, వారు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తమకు నివేదిస్తారన్నారు. రాష్ట్రంలోని 4.5 కోట్ల మందికి రూ.4వేల కోట్ల సబ్సిడీలతో నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలిపారు. అడ్డదారిలో డబ్బు సంపాదన.. షార్ట్ కట్లో డబ్బు సంపాదించేందుకు అనేకమంది ట్రేడర్లు అడ్డదారులు తొక్కుతూ వినియోగదారులను దోచుకుంటున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ రాజశేఖర్ పేర్కొన్నారు. పెట్రోలు బంకుల్లో వినియోగదారులను మోసగించవచ్చని, అదే సమయంలో ఆ బంకు ట్రేడర్ కూడా ఎక్కడో ఒకచోట మోసానికి గురవుతున్న విషయాన్ని గమనించాలన్నారు. చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందించేందుకు శాఖాపరంగా రెండు అడుగులు ముందుకు వేస్తే, డీలర్లు మూడు అడుగులువేసి వాటిని డైల్యూట్ చేస్తున్నారన్నారు. ఈ–పాస్ విధానం చాలా కాంప్లికేటెడ్ సిస్టం అయినప్పటికీ, ఎన్ఐసీలో పనిచేసిన ఒక రిటైర్డు అధికారిని పట్టుకొని సాఫ్ట్వేర్ మార్చేశారని, ఒక కార్డుకు సంబంధించి ఏది పెట్టినా ‘ఎస్’ అని వచ్చేలా మార్చేశారన్నారు. క్యాష్‌లెస్ విధానాన్ని డీలర్లు వ్యతిరేకించడం వెనుక వారి స్వప్రయోజనాలే అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని చౌకధరల దుకాణాల్లో 40 నుంచి 50శాతం అక్కడే బియ్యం రీ సైక్లింగ్ జరుగుతుందన్నారు. కొందరు చౌకబియ్యాన్ని రీసైక్లింగ్ చేసి రూ.10 నుంచి రూ.15కు అమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని చౌకధరల దుకాణాల్లో క్యాష్‌లెస్ విధానం అమలు చేస్తున్నామని, వినియోగదారుడు పాత పద్ధతిలోనే సరుకులు అడిగితే మాత్రం ఎలాంటి పేచీ పెట్టకుండా అందించాలన్నారు. అది సెటిల్ చేస్తే, ఇది సెటిల్ చేస్తా చంద్రన్న సంక్రాంతి, రంజాన్ తోఫా, పాఠశాలలు, అంగన్వాడీలకు నిత్యావసర సరుకులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవ్వాలని చౌకధరల దుకాణాదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు ఆ శాఖ కమిషనర్ రాజశేఖర్‌ను కోరారు. చౌకధరల దుకాణాలకు క్రెడిట్‌పై అందించిన కందిపప్పు బిల్లులను సెటిల్ చేస్తే, ఇది సెటిల్ చేస్తానని కమిషనర్ సమాధానం ఇవ్వడంతో డీలర్లు అవాక్కయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ మన్నం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జూన్ నుంచి సబ్సిడీ కిరోసిన్ కట్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు జూన్ నుంచి సబ్సిడీ కిరోసిన్ కట్ చేయనున్నట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. జూన్ 2వ తేదీ జరగనున్న నవ నిర్మాణ దీక్ష నాటికి రాష్ట్రంలో గ్యాస్ పొయ్యి లేని గృహాలు ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
మంత్రి ప్రత్తిపాటికి పదవి ’టెన్షన్’
-
దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోబోయి గాయపడ్డ ఎస్సై
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆందోళన కార్యక్రమం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సోమవారం ఆందోళనకు దిగారు. మంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా... రూరల్ ఎస్ఐ రామకృష్ణ అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. -
రాజధాని హామీలన్నీ అమలయ్యేలా చూస్తాం
రాజధాని గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, వైద్యం, ఉపాధికల్పన తదితర హామీలు పూర్తిగా అమలయ్యేలా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలు పంచాయతీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి మంత్రులు పుల్లారావు, నారాయణ గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఆర్డీవో స్థాయి అధికారులుగా ఉన్న సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు జవాబుదారీ తనంతో వ్యవహరించడం లేదని పత్తి పాటి పుల్లారావు అన్నారు. ఇప్పటివరకు ఏ విషయంలోనైనా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌తో సంప్రదించావా అని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ ఏసురత్నంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ ఐనవోలు గ్రామానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తానని తాను ఇచ్చిన హామీ అమలు కాకపోవడం తమ తప్పేనన్నారు. ఈ గ్రామంలోని అన్ని సమస్యలను బుధవారం నాటికి పరిష్కరించి గురువారం మరోసారి గ్రామంలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
'అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి'
గుంటూరు: రాజధాని ప్రాంత రైతులతో సక్రమంగా వ్యవహరించడం లేదని సీఆర్డీఏ అధికారులపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రైతులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమాచారాన్ని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నేతల వల్లనే సమస్యలు వస్తున్నాయని చెప్పడంతో అధికారులపై ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో రైతుల సమస్యలను పరిష్కరించాని ఆదేశించారు. -
చుక్కలు చూపిస్తున్న టమాట
కిలో రూ. 60 దాటి పైపైకి..గుంటూరులో కిలో రూ. 80 రైతు బజార్లలో నాసిరకం పలు జిల్లాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట విజయవాడ: సామాన్యులకు మొన్న ఉల్లి కంటతడి పెట్టిస్తే.. నిన్న పప్పన్నం దూరమైంది. నేడు టమాట ఠారెత్తిస్తోంది. గత నెల మొదటి పక్షంలో కిలో రూ.10గా ఉన్న ధర, నెలాఖరుకు రూ. 20కి చేరింది. ఇప్పుడు పలు జిల్లాల్లో కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకూ అమ్ముతున్నారు. ఇక రాజధాని ప్రాంతమైన గుంటూరులో ఏకంగా రూ. 80కిపైగా విక్రయిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రం ధర రూ. 30గా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా కిలో రూ. 34 నుంచి రూ. 40కి అమ్ముతున్న టమాటాలు మచ్చలు, పుచ్చులతో నాసిరకంగా ఉంటున్నాయి. టమాట ధరను నియంత్రించడానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంపై సామాన్యులు మండిపడుతున్నారు.పలు జిల్లాల్లో పంట మరో 10 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని, అప్పటి వరకూ ధర ఇలాగే ఉంటుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. అయి తే వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినడంతో ధర తగ్గడమెలా ఉన్నా పెరిగే చూచనలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో దెబ్బతీసిన వర్షాలు పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు టమాట పంటను దెబ్బతీస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా అనంతపురం, మదనపల్లితో పాటు తెలంగాణలోని వరంగల్ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు టమాట దిగుమతి అయ్యేది. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని చిత్తూరు జిల్లాల్లో వర్షాలకు పంట దెబ్బతింది. మరోవైపు కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోను వర్షాభావంతో బోర్లు, బావులు, చెరువులు అడుగంటి టమాట సాగు తగ్గిపోయింది. ఏపీలో టమాట మార్కెట్‌కు కీలకంగా ఉండే చిత్తూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా అరకొరగా చేసిన సాగు కూడా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతింది. దీనికితోడు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ వర్షాలకు పంట దెబ్బతినడంతో అక్కడికి రవాణా చేసేందుకు హోల్‌సేల్ వ్యాపారులు ఎగబడుతుండటంతో ధరలు ఠారెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కిలో రూ. 5 నుంచి రూ. 45 వరకూ పెరుగుతూ వచ్చింది. ఇక రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ఆంక్షల ఫలితంగా వేలాది ఎకరాలు బీడువారాయి. దీంతో టమాట సాగు కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అక్కడ రైతు బజార్లో కిలో టమాట రూ. 60, బహిరంగ మార్కెట్లో రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు. ధరలు నియంత్రిస్తాం: మంత్రి పుల్లారావు రాష్ట్రంలో టమాటతోపాటు ఇతర కూరగాయల ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టమోటాను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని సబ్సిడీపై సరఫరా చేయాలని మార్కెటింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించిందన్నారు. సంక్షోభంలో ఉన్న ఆయిల్ ఫాం రైతులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12,13 తేదీల్లో ఒక నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారని పుల్లారావు వెల్లడించారు. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించేందుకు రీసర్వే జరుగుతుందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పంటలను రక్షించేందుకు ఒకటి రెండు రోజుల్లో 1500 రెయిన్‌గన్స్ ద్వారా ప్రయోగాలు చేస్తామన్నారు -
రుణమాఫీపై రేపు మధ్యాహ్నం చంద్రబాబు ప్రకటన
హైదరాబాద్: రైతుల రుణమాఫీపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసిన తరువాత పత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీకి సంబంధించి సీఎంతో గంటన్నర సేపు సమావేశమైనట్లు తెలిపారు. డ్వాక్రా మహిళల రుణాలపై కూడా సీఎం రేపు ప్రకటన చేస్తారని చెప్పారు. 50 వేల రూపాయల లోపు రుణాలు వెంటనే రద్దు చేసే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. 43 లక్షల మంది రైతులు రుణమాఫీ కిందకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉన్న మంత్రులు, ఇతర ముఖ్య నాయకులతో సీఎం సమావేశమవుతారన్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్మీట్లో సీఎం ఒక ప్రకటిస్తారని చెప్పారు. ఎంత లోపు రుణాలు మాఫీ చేసేది, రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చే విషయం సీఎం చంద్రబాబు వివరంగా చెబుతారని మంత్రి పత్తిపాటి తెలిపారు. ఏపీ కొత్త రాజధానికి భూములు ఇచ్చే రైతులతో సీఎం మరోసారి సమావేశమవుతారని ఆయన చెప్పారు. ** -
రాజధాని కోసం 10 వేల ఎకరాల సమీకరణ : మంత్రి పత్తిపాటి
గుంటూరు: ఏపీ రాజధాని కోసం 10 వేల ఎకరాలు సమీకరించనున్నట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. 30 వేల ఎకరాలు సమీకరించేదాక ఎదురు చూడకుండా కృష్ట తీరంలో 10వేల ఎకరాలలో అందమైన రాజధాని నిర్మిస్తామన్నారు. రైతులకు నచ్చజెప్పే భూములను సమీకరిస్తామని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటామన్నారు. 49 లక్షల మందికి 37 వేల మంది మాత్రమే రుణమాఫీకి అసలు ఆధారాలు చూపించారని చెప్పారు. మరో 30 లక్షల మంది రైతులు సరైన ఆధారాలు చూపలేదన్నారు. వారికి మరో ఐదురోజులు సమయం ఇస్తామని చెప్పారు. సరైన ధ్రువపత్రాలు చూపిస్తేనే 11 లేదా 12 తేదీల్లో 20 శాతం నిధులను ఆ రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారని మంత్రి పుల్లారావు తెలిపారు. -
వీజీటిఎం రద్దు - రాజధాని అభివృద్ధి కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: వీజీటిఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేసి, దాని స్థానంలో రాజధాని అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి మండలి ఉపసంఘం ప్రకటించింది. ఏపి రాజధాని నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఉపసంఘం ఈ రోజు ఇక్కడ సమావేశమైంది. భూసేకరణకు విధి విధానాలను ఖరారు చేసింది. సమావేశం ముగిసిన తరువాత మంత్రి పత్తిపాటి పుల్లారావు విలేకరులతో మాట్లాడారు. 17 గ్రామాలలో 30 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. తుళ్లూరు మండలంలో 14 గ్రామాలు, మంగళగిరి మండలంలో మూడు గ్రామాలలో మాత్రమే భూమి సేకరించనున్నట్లు తెలిపారు. కృష్ణా నదికి దక్షిణ భాగాన ఈ గ్రామాలు వస్తాయని చెప్పారు. గ్రామంలో ఒక్క సెంటు భూమిని కూడా తీసుకోవడంలేదన్నారు. ఉన్న గ్రామాలు ఉన్నట్లు ఉంటాయని, ఎట్టి పరిస్థితులలోనూ వాటిని తరలించం అన్నారు. ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ భూమిని కూడా సేకరిస్తామన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా సాగు చేస్తుంటే వారికి పరిహారం చెల్లిస్తామని చెప్పారు. దాదాపు 21 వేల మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కిందకు వస్తారని తెలిపారు. సూత్రప్రాయంగా రైతులతో మాట్లాడితే సానుకూలత వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తి చేస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. అందరినీ ఒప్పించి భూమి సేకరిస్తామన్నారు. భూమి సేకరించిన తరువాత ఎకరాకు 25వేల రూపాయల చొప్పున పది సంవత్సరాల పాటు రైతుకు చెల్లిస్తామని చెప్పారు. ఒక్కో ఎకరం అభివృద్ధికి 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తామని చెప్పారు. అభివృద్ధి చేసిన తరువాత రైతుకు ఎకరాకు వెయ్యి గజాల భూమి ఇస్తామన్నారు. ఆ తరువాత రైతులకు అనుకూలంగా ఉన్నచోట లాటరీ ద్వారా భూమి ఇస్తామన్నారు. 9 నెలల్లో ఆరు సెక్టార్లలో రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఒక్కో సెక్టారులో 5వేల ఎకరాల భూమి ఉంటుందని తెలిపారు. మంత్రి మండలి ఉపసంఘం సమావేశంలో ఆరుగురు మంత్రులతోపాటు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్, గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ** -
అర్హులందరికీ పరిహారం
పారదర్శకంగా నష్టం అంచనాలు వేయండి సర్వే గడువు మరో మూడురోజులు పొడిగిస్తాం జాబితాలను గ్రామసభల్లో పెట్టండి అధికారులతో మంత్రులు గంటా, పత్తిపాటి సాక్షి, విశాఖపట్నం: ‘గతంలో విపత్తులు సంభవించినప్పుడు..ఎన్నడూ ఇవ్వలేని స్థాయిలో రెట్టింపు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అనర్హులకు అందినా ఫర్వాలేదు కానీ, అర్హుల్లో ఏ ఒక్కరూ మిస్ కావడానికి వీల్లేదు’ అని రాష్ర్టమంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో రూరల్ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నష్టం అంచనాలపై సమీక్షించారు. తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం. ముఖ్యమంత్రి నుంచి గ్రామ నౌకరు వరకు ప్రతీ ఒక్కరూ రేయింబవళ్లు శ్రమించాం. కేవలం ఆరు రోజుల్లోనే సాధారణ పరిస్థితుల్లోకి రాగలిగాం. ఇప్పుడు నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకోవడమే మనముందున్న ప్రధాన కర్తవ్య’మని మంత్రులు అన్నారు. గ్రామాల్లో నష్టం అంచనాలను పారదర్శకంగా చేపట్టండి. తుది జాబితాలను గ్రామసభల్లోనే కాదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించండి.. అభ్యంతరాలుంటే స్వీకరించి అర్హుల్లో ఏ ఒక్కరూ జాబితాలో మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకోండని సూచించారు. ప్రతీ ఒక్కర్ని ఆదుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నష్టం అంచనాల కోసం క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న సర్వే గడువు మరో మూడురోజులు పెంచే విషయమై కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికితీసుకెళ్లి అనుమతి తీసుకుంటామన్నారు. పలువురు మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ విశాఖ నగరంలో అందుతున్న వేగంగా గ్రామస్థాయిలో నిత్యావసరాలు,కూరగాయల పంపిణీ జరగడం లేదన్నారు. విశాఖలో మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని కోరారు. విశాఖలో తొమ్మిది సరుకులిస్తుంటే గ్రామాల్లో ఐదు సరుకులే ఇస్తున్నారని దీని వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. వరిపొలం పచ్చగా ఉన్నా తుఫాన్ ప్రభావానికి గురైనట్టుగానే పరిగణనలోకి తీసుకోవాలని,కొబ్బరి, జీడిమామిడి, మామిడి, సపోటా వంటి హార్టికల్చర్ పంటలకు కోళ్లఫారాలకు, జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ఉదారంగా స్పందించాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్శన్ లాలం భవానీ, ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు, జిల్లాసహకార శాఖాధికారి ప్రవీణ, ఆర్డీవో వెంకట మురళి, భీమిలి మున్సిపల్ మాజీ చైర్‌పర్శన్ గాడు చిన్న కుమారి లక్ష్మి పాల్గొన్నారు. -
మహిళలకు ఇచ్చే గౌరవమిదేనా?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ దృశ్యమిది. కిటికీ గోడ అంచున ఒకామె కూర్చొన్నారు చూశారా? ఆమె జిల్లా ప్రథమ పౌరురాలైన జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి. మన ప్రజాప్రతినిధులు ఆమెకిచ్చే గౌరవమిదే. అలాగని అదేమి పా ర్టీ సమావేశం కాదు. అధికారికంగా జరిగిన ప్రెస్‌మీట్. కానీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ వేదికపై ఆశీనులయ్యారు. అదే వేదికను అధికారికంగా పంచుకోవాల్సిన జెడ్పీ చైర్పర్సన్ సీటు లేక ఓ మూల కిటికీ గోడపై కూర్చోవల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంకో విశేషమేమిటంటే ఇదే వేదిక పై సీటు లేక మరో మహిళా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా వేదిక దిగువన ఉన్న కుర్చీలో కూర్చొన్నారు. ఇదీ, మన మహిళా ప్రజాప్రతినిధులకిచ్చే గౌరవం. అట్టడుగు వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించి, గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో రిజర్వేషన్లు ప్రకటిం చారు. ఆ క్రమంలోనే ఎస్టీ రిజర్వుడు కేట గిరీలో శోభా స్వాతిరాణి జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారిక సమావేశంలో తొలుత ఆమె ఆశీనులు కా వాలి. టీడీపీ ప్రజాప్రతినిధులు ఆ అవకాశమివ్వలేదు. జెడ్పీ చైర్‌పర్సన్‌కు కనీసం సీటు కేటాయించలేదు. ఇదే వేదికపై టీడీ పీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ కూర్చొన్నారు. కౌన్సిలర్ హోదా గల జగదీష్‌కు ఈ సమావేశంలో కూర్చొనే ప్రొటోకాల్ లేదు. విశేషమేమిటంటే వేదికపై మం త్రి పుల్లారావు ఎడమ వైపున తొలుత ఎ మ్మెల్యేలు కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు కూర్చొన్నారు. కానీ, జగదీష్ వేదికపైకి వచ్చినప్పుడు బొబ్బిలి చిరంజీవులను ఇటు పిలిచి మధ్యలో కూర్చొన్నారు. ఇది మరింత చర్చకు దారితీసింది. ఇక, సీటు లేక జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి చాలాసేపు నిలుచోవలసి వచ్చింది. ఆ తర్వాత కిటికీ గోడపై కూర్చోవల్సిన దుస్థితి ఎదురైంది. జెడ్పీ చైర్‌పర్సన్‌ను గౌరవించాలన్న ఆలోచన ఏ ఒక్క ప్రజాప్రతినిధికీ రాలేదు. సరికదా కిటికీ గోడపై ఆమె ఇబ్బందికరంగా కూర్చున్నా దయచూపే వారు కరువయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ పరిస్థితి ఇలా ఉంటే ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఏకంగా వేదిక దిగువన ఉన్న కుర్చీలో కూర్చోవాల్సి వచ్చింది. -
త్వరలో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటిన్లు: నారాయణ
హైదరాబాద్: తక్కువ ధరకే ఆహార పదార్థాలను అందించేందుకు త్వరలో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఏపీ మంత్రులు పరిటాల సునీత, నారాయణ తెలిపారు. తొలివిడతగా నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖలో 15, తిరుపతిలో 5, అనంతపురంలో 5, గుంటూరులో 10 క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు తెలిపారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రిల వద్ద అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తామని, పథకం ఎప్పుడనేది రేపటి కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని నారాయణ మీడియాకు వెల్లడించారు. ఏపీలో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు పాల్గొన్నారు. ఏపీలో అన్నా క్యాంటిన్ల పథకం సాధ్యాసాధ్యాలపై పౌరసరఫరాల శాఖ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. -
క్షేత్రస్థాయికి పరిశోధన ఫలాలు
శ్రీకాకుళం రూరల్: పరిశోధనల ఫలితాలు క్షేత్రస్థాయికి చేరాలని.. కాగి తాలపై లెక్కలు వేయ డం సరికాదని వ్యవసాయ మం త్రి పత్తిపాటి పుల్లారావు అధికారులకు సూచించారు. శనివారం నైర వ్యవసా య కళాశాల రజతోత్సవాల్లో పాల్గొన్న ఆయన అనంతరం అక్కడే జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పద్ధతులకు స్వస్తి చెప్పాల న్నారు. నిధులు, ఇన్‌ఫుట్ సబ్సిడీ బకాయిల గురించి వ్యవసాయ శాఖ జేడీ ప్రస్తావించగా సమాధానం దాటవేశారు. ఏవో, ఏఈవో పోస్టుల ఖాళీలను వెంటనే భర్త్తీ చేయాలన్నారు. భూసార పరీక్షా ఫలితాలను గ్రామ సభలు పెట్టి రైతులకు తెలియజేయాలన్నారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లా విత్తన గ్రామాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. వివరాలు చెప్పేందుకు అధికారులు ప్రయత్నించగా.. మళ్లీ జోక్యం చేసుకొని కాగితాల్లో కాదు.. నిజంగా ఉన్నాయా?.. ఉంటే విత్తన కొరత ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. దీంతో అధికారులు నీళ్ళు నమిలారు. 100 శాతం సబ్సిడీపై అందజేసిన ట్రాక్టర్లు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ గతంలో ఏదో జరిగిపోయింది.. ఇక ముందు జాగ్రత్తగా పని చేయండంటూ హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మత్స్యశాఖలో ఎన్ని చేప పిల్లలు సరఫరా చేశారని వ్యవసాయ మంత్రి ప్రశ్నించగా 5వేల పిల్లలు అవసరమని, ఫా రం లేకపోవడంతో అందించలేకపోతున్నామని అధికారులు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో పెనుమార్పులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని మంత్రి పుల్లారావు అన్నారు. రాగోలు పంచాయతీ రాయిపాడు సమీపంలో గేదెల రామారావు అనే రైతు వరినాటే యంత్రంతో సాగు చేసిన వరి క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంత్రీకరణ వల్ల రూ. 10 వేల తక్కువ ఖర్చుతో 5 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. రైతులకు అవగాహన కల్పించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ఆమదాలవలస మండలం తోటాడకు చెందిన తాండ్ర రమణ అనే రైతు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని మంత్రిని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి పుల్లారావు సమాధానమిస్తూ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిన పడుతోందని అన్నీ జరుగుతాయన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతు విద్యుత్ సరఫరా గతం కంటే బాగుంది కదా అని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ కొత్తపల్లి గీత, ఆచార్య ఎన్జీ. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ అల్లూరి పద్మరాజు, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అసోసియేట్ డీన్ ఎ.ఎస్.రావు, ఎంపీపీ గొండు జగన్నాధరావు, కర్రి జీవరత్నం, కర్రి కృష్ణమోహాన్ పాల్గొన్నారు. శిలాఫలకానికి టీడీపీ విభేదాల సెగ నైర కళాశాల రజతోత్సవాలల్లో టీడీపీలోని విభేదాలు మరోమారు బయటపడ్డాయి. తమ ఎమ్మెల్యే పేరు లేదంటూ కొందరు కార్యకర్తలు అప్పుడే ఆవిష్కరించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశార. రజోత్సవాలకు గుర్తుగా కళాశాల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర రైతు కుటుంబ విగ్ర హం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలో స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేరు లేదు. దీంతో ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శిలాఫలకాన్ని పగులగొట్టారు. దీనిపై పూర్వ విద్యార్థులు స్పందిస్తూ కేబినేట్ హోదా ఉన్న నేతల పేర్లనే శిలాఫలకంలో పెట్టామని, మిగిలిన ఆహ్వానితుల పేర్లను దాని పక్కనే ఉన్న మరో శిలాఫలకంపై వేశామన్నారు. విషయం తెలుసుకోకుండా శిలాఫలకాన్ని పగులగొట్టడం సమంజసం కాదన్నారు. -
రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పలేదు: మంత్రి పుల్లారావు
ఢిల్లీ: రైతురుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పలేదని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రైతు రుణమాఫీ చేస్తామన్నామంతే అన్నారు. ఆర్బిఐ నుంచి రీషెడ్యూల్ లేఖ రాగానే కోటయ్య కమిటీ నివేదిక ఇస్తుందని చెప్పారు. కోటయ్య కమిటీ నియమనిబంధనల మేరకు రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉన్నందునే రుణమాఫీ అంటున్నారని చెప్పారు. ఏపీకి లోటు బడ్జెట్ ఉందని, ఒక సంవత్సరం మారటోరియం, రెండు సంవత్సరాలు రీషెడ్యూల్ చేస్తారన్నారు. గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకు 500 ఎకరాల స్థలం సిద్ధం చేసినట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రంని నిధులు అడిగినట్లు చెప్పారు. ఏపీని ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.