
పత్తిపాటి పుల్లారావు
గుంటూరు: ఏపీ రాజధాని కోసం 10 వేల ఎకరాలు సమీకరించనున్నట్లు మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. 30 వేల ఎకరాలు సమీకరించేదాక ఎదురు చూడకుండా కృష్ట తీరంలో 10వేల ఎకరాలలో అందమైన రాజధాని నిర్మిస్తామన్నారు. రైతులకు నచ్చజెప్పే భూములను సమీకరిస్తామని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం భూములు ఇచ్చిన రైతులను ఆదుకుంటామన్నారు.
49 లక్షల మందికి 37 వేల మంది మాత్రమే రుణమాఫీకి అసలు ఆధారాలు చూపించారని చెప్పారు. మరో 30 లక్షల మంది రైతులు సరైన ఆధారాలు చూపలేదన్నారు. వారికి మరో ఐదురోజులు సమయం ఇస్తామని చెప్పారు. సరైన ధ్రువపత్రాలు చూపిస్తేనే 11 లేదా 12 తేదీల్లో 20 శాతం నిధులను ఆ రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారని మంత్రి పుల్లారావు తెలిపారు.