గుంటూరు జిల్లా రెంటచింతల మండలకేంద్రంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న రిలయన్స్ టవర్ ఎక్కి ....
సెల్‌టవరెక్కిన ఎమ్మార్పీఎస్ నేత
Published Sat, Feb 13 2016 10:56 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM
రెంటచింతల : గుంటూరు జిల్లా రెంటచింతల మండలకేంద్రంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న రిలయన్స్ టవర్ ఎక్కి గుంటూరు జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధానకార్యదర్శి గాడిపట్టి శ్రీనివాస రావు హల్‌చల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓ సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేసేది లేదంటూ వ్యాఖ్యానించటంతో శ్రీనివాసరావు సెల్ టవర్ ఎక్కారు. పుల్లారావు 24 గంటల్లో క్షమాపణ చెబితేనే కిందకు దిగుతానంటూ శ్రీనివాసరావు చెబుతున్నాడు లేకపోతే టవర్‌పై నుంచి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాసరావును కిందకు దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement
Advertisement