పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి | demand for sc castes divides | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి

Published Wed, Jul 20 2016 11:39 PM | Last Updated on Sat, Sep 15 2018 3:01 PM

ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ : ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లెపోగు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని హామీ ఇచ్చారని, అధికారాన్ని చేపట్టాక ఆ హామీని విస్మరించారని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా మాదిగలు తమ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారని, ప్రభుత్వాలు మాదిగలను వాడుకొని వదిలేస్తున్నారని విమర్శించారు.
    బీజేపీ మాదిగలకు ఇచ్చిన హామీ ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించని పక్షంలో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిన్నయ్య, కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు భగవంతు, ప్రధాన కార్యదర్శి జంబులయ్య, మల్లి, కాశన్న తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement