ఎమ్మార్మీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆదివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళగిరి: దళితుల సమస్యల పరిష్కారానికి తలపెట్టిన దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసనగా శాంతి ర్యాలీకి దిగిన ఎమ్మార్మీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆదివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు.
పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా, ఇరువైపులా తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే, అదుపులోకి తీసుకునే క్రమంలో మందకృష్ణ మాదిగ పోలీసుల చేతిలో ఉన్న తాడును మెడకు చుట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.