నమ్మించి మోసం చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు దిట్ట అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అన్నారు.
నాయుడుపేట : నమ్మించి మోసం చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు దిట్ట అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగలతో ఉద్యమాలు చేయించి రిజర్వేషన్‌ను అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆయన ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాదిగల చేత ఉద్యమాలు చేయించి ఆ కేసుల్లో కూడా వారిని బాబు ఇరికించారని చెప్పారు.
మాదిగలతో పాదయాత్ర చేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబు అదే మాదిగలను దూరం చేశారని ఆయన వైఖరిని దుయ్యబట్టారు. మాదిగలను మోసం చేయడాన్ని అన్ని వర్గాలవారు గమనిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నారాయణ, గోవిందువాసు మాదిగ, వెంకటేశ్వర్లు, కంటేపల్లి రాజేష్, రవి పాల్గొన్నారు.