'రజాకార్లనే తరిమికొట్టారు.. కేసీఆర్ ఎంత' | mandakrishna fired on cm KCR | Sakshi
Sakshi News home page

'రజాకార్లనే తరిమికొట్టారు.. కేసీఆర్ ఎంత'

Published Thu, Jun 11 2015 10:48 AM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM

'రజాకార్లనే తరిమికొట్టారు.. కేసీఆర్ ఎంత' - Sakshi

'రజాకార్లనే తరిమికొట్టారు.. కేసీఆర్ ఎంత'

బౌద్దనగర్ (హైదరాబాద్) : తెలంగాణ సాయుధ పోరాటంలో గడీల దొరలు, రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఇక్కడి ప్రజలదని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను తరిమికొట్టడం ఎంత అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ అన్నారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ మహిళా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  తెలంగాణ ఆడబిడ్డలకు పోరాటాలు కొత్తేమీ కాదని, నిజాం వ్యతిరేక పోరాటంలో వారి పాత్ర కీలకమైందన్నారు.

మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించాలని మండల, జిల్లా కేంద్రాల్లో దీక్షకు దిగుతామని మహిళలందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. రమేష్ కుమార్, లత, రాజక్క, సత్యక్క, యాదమ్మ, భారతి, లక్ష్మి, కోళ్ల వెంకటేశ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement