- ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
అనంతపురం
ఎస్టీ ప్రజా ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గంపన్నను అవమానపర్చే ధోరణిలో మాట్లాడిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పరిషత్‌హాలులో అంబేద్కర్ జయంతి సభ జరుగుతున్న సమయంలో పలువురు దళిత సంఘాల నాయకులు సభను అడ్డుకునేందుకు యత్నించారు. అయితే పోలీసులు కార్యాలయం ముందే అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్బంగా ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీఆర్‌దాస్, నాయకులు సీపీ నారాయణస్వామిలు మాట్లాడుతూ... దళిత ప్రజాప్రతినిధులకే రక్షణ లేకుండా పోతోందని, ఇక సామాన్య దళితులకు ఏమి న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. దీంతో ఆందోళన కారుల వద్దకు ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, డిప్యూటీ మేయర్ గంపన్నలు వచ్చి సర్దిజెప్పారు. సమస్య పరిష్కారానికి ఇది వేదిక కాదని సూచించడంలో ఆందోళన విరమించారు.
అనంతపురంలో దళిత నాయకుల ధర్నా
Published Thu, Apr 14 2016 8:17 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement