ఎస్సీ వర్గీకరణ అంశంపై నోరు మెదపని కేసీఆర్ మాదిగల ద్రోహి అని విమర్శించారు. నిరసనలో భాగంగా నేడు రాష్ర్టవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
కేసీఆర్ మాదిగల ద్రోహి : ఎమ్మార్పీఎస్
Published Thu, Jan 5 2017 7:32 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
కుషాయిగూడ: నాడు ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి తప్పించి.. నేడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర పదవి కాలం పొడగించకుండా సీఎం కేసీఆర్ అవమానపరిచారని మేడ్చల్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుడు కేశపాక రాంచందర్ ఆరోపించారు. రాంచందర్ ఆధ్వర్యంలో గురువారం ఈసీఐఎల్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం నుంచి దళితులను కేసీఆర్ అవమానపరుస్తూనే ఉన్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కేశపాక రాంచందర్ మాదిగ మాట్లాడారు.

Advertisement
Advertisement