సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంద కృష్ణపై రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంద కృష్ణ విడుదలను కోరుతూ ఈ నెల 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 27న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ ప్రకటించింది. మంద కృష్ణకు ఎటువంటి హాని జరిగినా అందుకు సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
27న రాష్ట్రబంద్
Published Sun, Dec 24 2017 3:07 AM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment