ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెను మార్చి 10న ముట్టడిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెను మార్చి 10న ముట్టడిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. బామినిలో బుధవారంజరిగిన ఎమ్మార్పీఎస్ జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగంగా నారావారిపల్లె ముట్టడితో పాటు, ఏప్రిల్ 10న విజయవాడలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో ఆందోళన కార్యక్రమాలు చేపడాతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.