మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ
సాక్షి, భువనగిరి జిల్లా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం ఆయన భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... గత అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన విదంగానే లోక్‌సభకు కూడా మద్దతు ఇస్తున్నామన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మాదిగ వర్గీకరణ జరుగుతుందనే నమ్మకంతో మద్దతు ప్రకటించామని తెలిపారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి సికింద్రాబాద్, నాగర్ కర్నూల్లో కాంగ్రెసు మద్దతు ఇవ్వడం లేదన్నారు.
బీజేపీ నేత కిషన్ రెడ్డి మాదిగ వర్గానికి అండగా నిలిచిన కారణంగా ఆయనకు మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. నాగర్ కర్నూల్లో ఎంపీగా ఆరు సార్లు గెలిచిన నంది ఎల్లయ్యను కాదని మాల సమాజానికి వర్గానికి చెందిన మల్లు రవికి టికెట్ ఇవ్వడంతో అక్కడ కాంగ్రెసు కాదని నిలబడ్డ వారిలో మిగతా పార్టీలకు మద్దతు ఇస్తామని అన్నారు. భువనగిరి లోక్‌సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కోమటిరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment