సాక్షి, హైదరాబాద్ : భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి భారీ ఓటమిని చవిచూశారు. అయినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డిపై నమ్మకంతో ఆయనకు భువనగిరి లోక్‌సభ టికెట్ ఇచ్చింది. అధిష్టానం నమ్మకాన్ని నిజం చేస్తూ కోమటిరెడ్డి విజయం సాధించారు. కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి ప్రజలు ఈ విజయాన్ని ఆయనకు కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఓటమి పాలైన టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment